ఆమె బాడీ కి ఆ డ్రెస్సులు సెట్ కావు.. శ్రీముఖి పై షాకింగ్ కామెంట్స్ చేసిన స్టార్ హీరోయిన్..!?

Anilkumar
బుల్లితెరపై చాలామంది యాంకర్లు ఉన్నారు.. అయినప్పటికీ వాళ్లందరికీ పోటీగా టాప్ యాంకర్ గా దూసుకుపోతుంది శ్రీముఖి. జూలై మరియు నేను శైలజ, జెంటిల్మెన్ వంటి సినిమాలలో సైతం నటించిన ఈమె దాని అనంతరం మళ్లీ షో లతో బిజీ అయింది. సినిమాలలో నటిస్తున్న సమయంలో అదుర్స్ అనే షో తో యాంకర్ గా తన కెరియర్ను మొదలుపెట్టింది శ్రీముఖి. దాని అనంతరం వరుస షోలతో బిజీగా ఉన్న సమయంలో మాటీవీలో ప్రసారమయ్యే బిగ్ బాస్ లో కూడా ఎంట్రీ ఇచ్చింది ఈమె. ప్రస్తుతం చేతినిండా ఆఫర్లతో బిజీగా ఉంది ఈమె. 

 సినిమాలే కాకుండా అనేకమైన ఈవెంట్లలో యాంకర్ గా కొనసాగుతుంది శ్రీముఖి. ఇప్పటికే అనేక షోలకు యాంకర్ గా వ్యవహరించిన ఈమె ప్రస్తుతం బీబీ జోడీ అనే డాన్స్ షో తో బిజీగా మారింది. ఈ షోలో భాగంగా బిగ్ బాస్ సీజన్ లో కంటెస్టెంట్లుగా వచ్చిన సెలబ్రిటీలను జంటలుగా చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనేటట్లు చేస్తున్నారు. ఇక ఈ షో కి సంబంధించిన ఒక ప్రోమో తాజాగా విడుదల అయ్యింది. ఇందులో భాగంగా యాంకర్ శ్రీముఖి ఒక చిన్న నిక్కర్ మాత్రమే వేసుకుని కనిపించింది. దీంతో ఈ ప్రోమోలో శ్రీముఖి వేసుకున్న అ డ్రస్ హైలెట్ అవుతుంది.

చాలామంది శ్రీముఖి వేసుకున్న డ్రస్సు గురించి విపరీతమైన కామెంట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా శ్రీముఖి ధరించిన డ్రస్ గురించి సాధారణ ప్రజలు మరియు అభిమానులే కాకుండా సెలబ్రిటీలు సైతం కామెంట్లు చేయడం గమనార్హం. అయితే ఇందులో భాగంగా తెలుగు హీరోయిన్ అయిన మాధవి లత తన సోషల్ మీడియా వేదిక ద్వారా శ్రీముఖికి డ్రస్ అసలు సెట్ కాలేదు అంటూ పోస్ట్ ను షేర్ చేయడం జరిగింది. దీంతోపాటు తనకి తోచిన సలహాలను కూడా ఇచ్చింది.  దీంతో ఈ విషయం కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. తన పోస్టులో మాధవి లత.. నువ్వు మోడ్రన్ ఆల్ట్రా మోడ్రన్ డ్రెస్సులను వేసుకోవాలి కానీ అవి నీ బాడీకి సెట్ కావు కళ్లకు నచ్చితేనే కాదు మనం వేసుకున్న డ్రెస్ మన బాడీకి కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి అప్పుడు చూడడానికి మనం చాలా అందంగా కనబడతాము అంటూ చెప్పుకొచ్చింది ఈమె. ఆఖరిగా ఈ డ్రెస్ నీకు అస్సలు సెట్ కాలేదు అంటూ తన అభిప్రాయాన్ని తెలియజేసింది. దీంతో మాధవి లత చేసిన ఈ పోస్ట్ కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: