టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు వరుస సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ హోదాను తెచ్చుకున్న అనుష్క గురించి మనందరికీ తెలిసిందే. నాలుగు పదుల వయసు దాటినప్పటికీ ఇంకా ఈమె పెళ్లి చేసుకోలేదు. ఇక సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు అనుష్క పెళ్లికి సంబంధించిన వార్తలు, వైరల్ అవుతూనే ఉంటాయి.కానీ అనుష్క మాత్రం ఈ వార్తలపై ఎన్నడు స్పందించలేదు. ఎప్పుడు ఏ ఇంటర్వ్యూలోను పలానా సమయం వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటాను అని కూడా అనుష్క స్పష్టత ఇవ్వలేదు. దీంతో చాలామంది సోషల్ మీడియా వేదికగా ఈ వార్తను వైరల్ చేస్తూ ఉంటారు.
అయితే తాజాగా అనుష్క నిజంగానే పెళ్ళికి రెడీ అయింది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. తెలంగాణకు చెందిన ఒక బంగారు వ్యాపారం చేసే బిజినెస్ మాన్ ని అనుష్క పెళ్లి చేసుకుంటుంది అన్న వార్తలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.ఇక దీనికి సంబంధించిన భూత కోలా పండగలో కూడా అనుష్క పాల్గొన్నట్లుగా తెలుస్తోంది.ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా అనుష్క పెళ్లికి సంబంధించి ఒక ప్రముఖ జ్యోతిష్యుడు సంచలమైన నిజాలను బయటపెట్టాడు. ఇక ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వేలవుతున్నాయి.
అయితే ఆ జ్యోతిష్యుడు మాట్లాడుతూ త్వరలోనే అనుష్క పెళ్లి జరుగుతుంది.. తనకి వివాహ ఘడియలు దగ్గర పడ్డాయి.. తన పెళ్లి కి సంబంధించిన గ్రహాలు చాలా బాగున్నాయి..తన జాతకాన్ని బట్టి చూస్తే అనుష్క 2023లో ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటుంది అని.. అంతేకాదు సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిని తను పెళ్లి చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని.. ఆయన చెప్పుకొచ్చాడు. దీంతోపాటు అందరిలాగా పెళ్లి చేసుకున్న అనంతరం ఎలాంటి వివాదాలు లేకుండా వీరి వివాహ బంధం చాలా బాగుంటుందని ఆయన పేర్కొన్నాడు. ఇంకా 2023లో అనుష్క పెళ్లి పీటలు ఎక్కుతుంది అంటూ అనుష్క అభిమానులకు పండగ లాంటి చెప్పాడు ప్రముఖ జ్యోతిష్యుడు.ఈయన చెప్పిన వార్తల్లో నిజమెంతుందో తెలియదు గానీ ఈ వార్త విన్న అనంతరం ఆమె అభిమానులు తెగ సంతోషిస్తున్నారు..!!