రవితేజ "ధమాకా" వసూళ్లు స్పీడ్ అందుకున్నాయా?

VAMSI
ఈ నెల 23 వ తేదీన రవితేజ మరియు శ్రీలీలలు హీరో హీరోయిన్ లుగా నటించిన తాజా చిత్రం ధమాకా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. వాస్తవంగా ఈ సినిమా ఫలితం మీద టోటల్ యూనిట్ చాలా నమ్మకాన్ని మరియు ఆశలను పెట్టుకుంది. ఇక రవితేజకు అయితే ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవ్వాల్సిన పరిస్థితి అని చెప్పాలి. రవితేజకు క్రాక్ తర్వాత వరుసగా ఖిలాడి మరియు రామారావు ఆన్ డ్యూటీ సినిమాలు ప్లాప్ లుగా మిగిలాయి. కాగా ఈ సినిమా పైన అభిమానులకు మరియు ఇండస్ట్రీ వర్గాలకు భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు కారణం టీజర్ , ట్రైలర్ మరియు పాటలు ఎంతలా ప్రేక్షకులను ప్రభావితం చేశాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.
కానీ రిలీజ్ రోజున రివ్యూలు మరియు ప్రేక్షకుల స్పందన అయితే సినిమాపై అంతగా ఆశలు కలిగించలేదు. కథలో కొత్తదనం లేకపోవడం మరియు స్క్రీన్ ప్లే లోపాలు ఉండడంతో ఈ సినిమా చాలా కాలం థియేటర్ లలో ఉండడం కష్టమే అని ట్రేడ్ వర్గాలు భావించాయి. అయితే వీకెండ్ లో వచ్చిన కలెక్షన్ లను ఆధారంగా చేసుకుని, ఇపుడే ఇలా వస్తే వీక్ డేస్ లో ఎలా రాణిస్తుంది అని అంతా అనుమానాలను వ్యక్తం చేశారు. ఈ సినిమా రిలీజ్ అయిన మూడు రోజులకు మొత్తం 32 కోట్ల వసూళ్లను అందుకుంది . కథతో సంబంధం లేకుండా పెద్దగా సినిమాలు కూడా ఏమీ లేకపోవడంతో ఆ మాత్రం కలెక్షన్ లను అందుకుంది.
ఇక ఈ రోజు కూడా ఫ్రీ బుకింగ్స్ బాగానే జరిగాయని టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా రవితేజ మాస్ నటన , శ్రీలీల గ్లామర్ మరియు సాంగ్స్ సినిమా విజయానికి ప్లస్ అయ్యాయి. ఈ ఊపు ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా ఈవారం మంచి కలెక్షన్ లను సాధించే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: