రవితేజ సినిమా హిట్టా? ఫట్టా?

Satvika
తెలుగు స్టార్ హీరో మాస్ మహరాజ రవితేజ కు ఈ మధ్య ప్లాప్ సినిమాలు వదల్లేదు.. ఎంత భారీగా కథ, బడ్జెట్ ఉన్నా కూడా సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయి... క్రాక్ సినిమాతో భారీ హిట్ ను అందుకున్నా కూడా తర్వాత వచ్చిన వరుస సినిమాలు బాక్సాఫిస్ వద్ద బోల్తా కొట్టాయి. తాజాగా ధమాకా తో ప్రేక్షకులను పలకరించాడు. ఆ సినిమా కూడా ఈరోజు భారీ అంచనాల తో ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది..మొన్నటి వరకూ సినిమా నుంచి విడుదల అయిన అన్నీ కూడా సినిమా పై జనాల్లొ భారీ అంచనాలను క్రియేట్ చేసింది..


జనాలను థియెటర్లకు రప్పించడానికి చిత్ర యూనిట్ పెద్ద జిమ్మిక్కులు చేసిందని తెలుస్తుంది.ఈ సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో రవితేజ చేసిన ఓ కామెంట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది..రే సినిమా తర్వాత రవితేజ సినిమాలు చెయ్యడు అనే టాక్ కూడా సినీ వర్గాల్లో వినిపించింది.ఓ ఇంటర్వ్యూ లో రవి తేజ మాట్లాడుతూ.. ఈ సినిమా హిట్ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకున్నా నేను.. కానీ ఫెయిల్ అయ్యిందంటూ రవితేజ చెప్పిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ధమాకా నేడే విడుదల అయిన మేరకు ఈ వీడియోను చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. అయితే అసలు మ్యాటర్ వేరే ఉంది. ఆ వీడియోను ముందునుండీ చూస్తేనే అసలు విషయం తెలుస్తోంది.


ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో రవితేజ తన కెరీర్‌లో ఈ సినిమా  హిట్ అవ్వాలని కోరుకున్నా కూడా అవి  ఫ్లాప్ మూవీలుగా నిలిచిన 'నా ఆటోగ్రాఫ్', 'నేనింతే' సినిమాల ప్రస్తావన తీసుకొచ్చాడు.ఈ రెండు సినిమాలు బాగా నచ్చినవి..కానీ జనాలకు నచ్చలేదని..అందుకు ప్లాప్ అయ్యాయని రవి కొద్దిరొజుల క్రితం అన్నారు.ఇక కొందరు ధమాకా ఫోటో పెట్టి ఈ వీడియోతో ట్రోలింగ్ చేస్తుండటంతో రవితేజ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఇక ధమాకా మూవీలో మాస్ హీరో పక్కన శ్రీలీల హీరోయిన్‌గా నటించగా, ఈ సినిమాను దర్శకుడు నక్కిన త్రినాథరావు డైరెక్ట్ చేశాడు..మొత్తానికి ఈ సినిమా పర్వా లేదనే టాక్ ను అందుకుంది..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: