నందమూరి నటసింహం బాలకృష్ణ మరియు బోయపాటి శ్రీను కాంబినేషన్ కు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉంది. బాలయ్యతో సినిమా తెరకెక్కించడం వల్ల బోయపాటి శ్రీను కెరియర్ కు ప్లస్ అయింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక అదే సమయంలో బోయపాటి సినిమాల వల్ల బాలయ్య మార్కెట్ కూడా బాగా పెరిగింది. అభిమానులు బాలయ్యను ఏ విధంగా చూడాలి అని కోరుకున్నారో బోయపాటి అలాగే చూపించారూ. ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్ లో బాలయ్య నటిస్తున్న ప్రాజెక్టు పూర్తయిన వెంటనే బోయపాటి శ్రీను డైరెక్షన్లో నటించాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.
బాలయ్య మరియు బోయపాటి కాంబినేషన్ అంటే సినిమా కథతో సంబంధం లేకుండా పొలిటికల్ డైలాగ్స్ ఖచ్చితంగా ఉంటాయని 2024 ఎన్నికలకు ముందే ఈ కాంబినేషన్ వస్తే బాగుంటుంది అని... ఇక ఆ సినిమా లెజెండ్ కు సీక్వెలైన అఖండకు సీక్వెలైన అభ్యంతరం లేదు అని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. ఇక బాలయ్య అభిమానులు చెబుతున్నదాన్ని బాలయ్య పట్టించుకుంటాడా లేదా అన్నది చూడాలి. బాలయ్య దగ్గరి నుండి గ్రీన్ సిగ్నల్ రావడమే ఆలస్యం. బోయపాటి... రామ్ తో సినిమాను పూర్తి చేసిన వెంటనే బాలయ్యతో సినిమా చేసే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఇక వీరి కాంబినేషన్లో నిర్మించే అవకాశం కోసం చాలామంది నిర్మాతలు కూడా ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఆ నిర్మాతల్లో ఈ ఛాన్స్ ఎవరికీ వెళుతుందో చూడాలి. ఇక వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే గనుక కళ్ళు చెదిరే లాభాలను అందించడంతోపాటు మాస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. దర్శకుడు బి గోపాల్ తర్వాత బాలయ్య బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టు సినిమాలను తెరకెక్కించే దర్శకుడుగా బోయపాటి శ్రీను పేరు తెచ్చుకున్నాడు.దీంతోపాటు బాలయ్య అభిమానులకు బోయపాటి పై ప్రత్యేకమైన అభిమానం కూడా ఉంది. దీంతో ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!!