బాలకృష్ణ జూనియర్ ల సాన్నిహిత్యానికి పరీక్షగా మారిన అన్ ష్టాపబుల్ !

Seetha Sailaja
ఈమధ్య ఒక మీడియా సమావేశంలో నందమూరి హీరో తారక్ రత్న మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో తన తమ్ముడు జూనియర్ తెలుగుదేశం తరఫున ప్రచారం చేయడం ఖాయం అని యధాలాపంగా అన్నమాటలు నందమూరి అభిమానులకు విపరీతంగా జోష్ ను కలిగిస్తున్నాయి. వాస్తవానికి తెలుగుదేశంలోని అనేకమంది ఎప్పటి నుండో జూనియర్ ను రాజకీయాలలోకి రమ్మని అడుగుతూనే ఉన్నారు.

ఈవిషయమై తారక్ స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా దీనికి చాలసమయం ఉంది అంటూ తన సమాధానాన్ని దాటవేస్తున్నాడు. జూనియర్ బాలకృష్ణల మధ్య బయటపడని చిన్న గ్యాప్ ఉంది అన్నప్రచారం ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ ఈవిషయమై అటు బాలయ్య కానీ ఇటు జూనియర్ కానీ ఎలాంటి కామెంట్స్ చేయకుండా తమతమ సినిమాలలో ఎప్పుడు బిజీగా ఉంటారు.

అయితే నందమూరి అభిమానులు మాత్రం బాలకృష్ణ జూనియర్ లు కలిసి నటిస్తే చూడాలి అని ఓపెన్ గా అడుగుతున్నప్పటికీ దానికి తగ్గ కథ దొరకాలి కదా అంటూ ఇద్దరూ తెలివిగా సమాధానం ఇస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ‘అన్ ష్టాపబుల్ 2 సీజన్’ షో మళ్ళీ జూనియర్ బాలయ్యల సాన్నిహిత్యం పై చర్చలకు తెరలేపింది. ఈషోకు పవన్ కళ్యాణ్ ప్రభాస్ లు కూడ వస్తున్న పరిస్థితులలో అసలు జూనియర్ బాలకృష్ణ షోకు ఎందుకురాడు అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.

తన బాబాయి హోస్ట్ చేస్తున్న షోకు అతిధిగా రావడానికి ప్రయత్నించని జూనియర్ వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం తరఫున ప్రచారం చేస్తాడు అని ఎలా అనుకుంటాము అంటూ మరికొందరు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున జూనియర్ ప్రచారం చేసిన సందర్భాలు చాల ఉన్నాయి. అయితే అప్పట్లో జూనియర్ ప్రచారం చేసినా తెలుగుదేశం ఓటమి పాలు అయింది. ఆసంఘటన తరువాత పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న తారక్ కనీసం తన బాబాయితో టివి షోలో కనిపించి తామిద్దరం ఒకటే అన్న భావన కలిగించవచ్చు కదా అంటూ మరికొందరు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: