మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వాల్తేరు వీరయ్య మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. శృతి హాసన్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. వాల్తేరు వీరయ్య మూవీ కోసం మైత్రి మూవీ మేకర్ సంస్థ వారు ఏకంగా 130 కోట్లు ఖర్చు పెట్టబోతున్నట్లు సమాచారం.
దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందిస్తూ ఉండగా , టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరో లలో ఒకరు అయినటు వంటి మాస్ మహారాజా రవితేజ ఈ మూవీ లో ఒక అద్భుతమైన కీలక పాత్రలో నటిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ లోని రవితేజ కు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ ను ఈ మూవీ యూనిట్ విడుదల చేయగా , దీనికి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం జనవరి 13 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ నుండి రెండు పాటలను చిత్ర బృందం విడుదల చేసింది.
ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి విడుదల చేసిన రెండు పాటలకు కూడా ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ నుండి చిత్ర బృందం మూడవ పాటను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూడవ పాట "పూనకాలు లోడింగ్" అనే టైటిల్ తో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ సాంగ్ అద్భుతమైన రేంజ్ లో ఉండబోతున్నట్లు సమాచారం. మరి కొన్ని రోజుల్లోనే వాల్తేరు వీరయ్య మూవీ యూనిట్ ఈ సినిమా ప్రమోషన్ లను ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది.