బిగ్ బాస్ 6 ఇప్పుడు చివరికి వచ్చిన సంగతి తెలిసిందే.. గత సీజన్లకు దారుణంగా ఈ సీజన్ టీఆర్పీ రేటింగ్ నమోదు చేసుకుంటుంది. అంతేకాకుండా.. మొదటి వారం నుంచే ఈ షో పై ప్రేక్షకులు అసంతృప్తి గా ఉన్నారు. ఎలిమినేషన్ పై కూడా విమర్శలు వెల్లువెత్తా యి. ఇక ఈ షోలో ఎప్పుడు ఏం జరుగుతుంది.. ఎటు వైపు వెళ్తుందో కూడా అర్థం కావడం లేదనేది ప్రధాన వాదన. ముఖ్యంగా ఇనయ ఎలిమినేషన్ అనంతరం బిగ్ బాస్ షో పై మరింత నెగిటివిటి పెరిగింది.
ఫైనల్ లో ఉండాల్సిన తనను.. ఓటింగ్ కు విరుద్దంగా బయటకు పంపించారని… గేమ్ ఆడకుండా టైం పాస్ చేస్తున్నారని ఇంట్లో ఉంచుతున్నారంటూ విమర్శలు వచ్చాయి.హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జున పై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు నెటిజన్స్. అయితే ఇవేం పట్టించుకోకుండా.. బిగ్ బాస్ షోను ఫైనల్ వరకు తీసుకొచ్చారు నిర్వాహకులు. ఇక ఎట్టకేలకు ఇప్పుడు ముగింపుకు చేరుకుంది..మరి కొన్ని గంటల్లో విన్నర్ ఎవరు అనేది తెలనుంది..
ఆ కారణం తోనే హోస్ట్ నాగ్ కూడా తప్పుకున్నట్లుగా సమాచారం. అలాగే వచ్చే సీజన్ కు రౌడీ హీరో విజయ్ వ్యాఖ్యత గా ఉండనున్నాడని టాక్ వినిపిస్తోంది. మరి ఈ వార్తల లో ఎంతవరకు నిజముందన్నది తెలియాల్సి ఉంది. 21 మంది తో మొదలైన ఈ సీజన్ చివరకు 5 గురు మిగిలారు. మొన్నటి వరకు ఆరుగురు ఉండగా.. మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటూ శ్రీసత్యను ఇంటి నుంచి పంపించేశారు. ఇక చివరగా.. కీర్తి, శ్రీహాన్, రేవంత్, ఆదిరెడ్డి, రోహిత్ ఫైనలి స్టులుగా నిలిచారు. అయితే ఎలిమినేట్ అయిన శ్రీసత్య ఇప్పటివరకు బయటకు రాలేదు. ఇక రేపు ఆదివారం సాయంత్రం విన్నర్ ఎవరనేది తెలియనుంది.. మొత్తానికి విన్నర్ గా రేవంత్..రన్నర్‌గా శ్రీహాన్ అని స్పష్టంగా తెలుస్తుంది..