వాల్తేరు వీరయ్య రన్ టైం ఫిక్స్..ఎంతంటే?

Satvika
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'వాల్తేరు వీరయ్య' ప్రస్తుతం టాకీ పార్ట్ షూటింగ్ ముగించుకుని రిలీజ్‌కు రెడీ అవుతోంది. సినిమాలో బ్యాలెన్స్ సాంగ్స్‌ను షూట్ చేసేందుకు ప్రస్తుతం చిత్ర యూనిట్ ఫ్రాన్స్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాను దర్శకుడు బాబీ పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్ మూవీగా తెరకెక్కిస్తుండగా, ఈ సినిమా లో మెగాస్టార్ చిరంజీవి చాలా రోజుల తరువాత ఊరమాస్ అవతారంలో కనిపిస్తున్నాడు..

ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, టైటిల్ గ్లింప్స్, బాస్ పార్టీ సాంగ్ ప్రేక్షకుల్లో ఈ సినిమా పై అంచనాల ను అమాంతం పెంచేశాయి. కాగా, తాజాగా ఈ సినిమా కు సంబంధించిన రెండో సాంగ్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. అయితే ఈ సినిమా ను సంక్రాంతి బరి లో రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించగా, తాజాగా ఈ సినిమా రన్‌టైమ్‌ను చిత్ర యూనిట్ లాక్ చేసినట్లుగా తెలుస్తోంది..

వాల్తేరు వీరయ్య చిత్ర రన్‌టైమ్‌ను 2 గంటల 35 నిమిషాలు గా ఫిక్స్ చేసిందట చిత్ర యూనిట్. ఓ కమర్షియల్ ఎంటర్‌టైనర్ మూవీకి ఇది మంచి రన్‌టైమ్ అని సినీ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. ఇక మెగాస్టార్ మాస్ అవతారం లో వస్తున్న వాల్తేరు వీరయ్య మూవీలో మాస్ రాజా రవితేజ ఓ పవర్‌ఫుల్ పాత్ర లో నటిస్తుండటం విశేషం. ఈ సినిమా ను ఎప్పుడెప్పుడు చూద్దామా అని సినీ వర్గాల తో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఈ చిత్రాని కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌ తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.. ఈ సినిమా నుంచి ఇప్పటివరకూ వచ్చిన అన్నీ కూడా మంచి హిట్ టాక్ ను అందుకున్నాయి.. ఇక సినిమా ఎలా ఉంటుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: