కిక్ సినిమాను వదులుకున్న ఆ ఇద్దరు స్టార్ హీరోలు ?

Purushottham Vinay

రవితేజ హీరోగా తనకంటూ ఒక బ్రాండ్ ను క్రియేట్ చేసుకున్నాడు. రవితేజ నటించిన కిక్ సినిమా ఎంతటి అద్భుత విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఇప్పటికీ కూడా టీవీ లో వచ్చిన ప్రతీసారి  కిక్ మూవీ మంచి రేటింగ్స్ తో దూసుకుపోతుంది.. అంత పెద్ద బ్లాక్‌బస్టర్ గా నిల్చింది ఈ సినిమా .కిక్ కోసం ఏదైనా చేసే పాత్రలో మాస్ మాహరాజు రవితేజ అద్భుతంగా నటించాడు..సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రం సంచలన విజయం నమోదు చేసుకుంది.రవితేజ కెరీర్‌లో ఈ రోజుకు కూడా లాభాల పరంగా కానీ.. మార్కెట్ పరంగా కానీ చూసుకుంటే అతడి టాప్ సినిమాల్లో కిక్ ఒకటిగా నిలిచింది. అప్పట్లోనే 30 కోట్ల వరకు వసూలు చేసి రవితేజ రేంజ్ ఏంటో ఈ చిత్రం నిరూపించింది. కిక్ సినిమా 2009 మే 8 న రిలీజ్ అయింది. అప్పటికే అతిథి , అశోక్ లాంటి ఫ్లాపులతో వెనకబడిపోయిన సురేందర్ రెడ్డి కిక్ సినిమా కథ సిద్ధం చేసుకున్నాడు. ఈ సినిమా ఒప్పించడానికి చాలా మంది హీరోల చుట్టూ తిరిగాడు. కానీ చాలా మంది దీన్ని రిజెక్ట్ చేసారు.


జూనియర్ ఎన్టీఆర్ అలాగే ప్రభాస్ రిజెక్ట్ చేసిన ఈ మూవీ సరైన హీరోకే పడిందని తర్వాత అభిమానులు కూడా ఎంతో సంతోషపడ్డారు. వక్కంతం వంశీ రాసిన ఈ కథ ముందు రవితేజ కోసం అయితే సిద్ధం చేయలేదు. ఆయన్ని దృష్టిలో పెట్టుకుని రాసిన కథ అయితే కాదు..ప్రభాస్‌తో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు ముందుగా ఈ కథను సురేందర్ రెడ్డి వినిపించాడని సమాచారం. అయితే వాళ్ళు ఏ మూడ్ లో ఉన్నారో ఏమో గానీ మొత్తానికి ఈ సినిమాకి నో చెప్పారు. ఆ తర్వాత రవితేజ రేసులోకి వచ్చాడు. మాస్ రాజా ఎంట్రీతో కిక్ రూపమే మారిపోయింది. ఆయనతో పాటు బ్రహ్మానందం కామెడీ టైమింగ్ సినిమాను మరో రేంజ్ లో నిలబెట్టిందని చెప్పవచ్చు. చివర్లో పాప ఎమోషనల్ ఎపిసోడ్ అలాగే ఇలియానా గ్లామర్, కొత్త నటుడు శ్యామ్ నటన, ఇలా అన్నీ కూడా కలిపి అప్పటి వరకు 10 కోట్లున్న రవితేజ మార్కెట్‌ను ఏకంగా 25 కోట్లకు కిక్ మూవీ తీసుకొని వెళ్ళింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: