ఇండియన్ 2: ద్విపాత్రాభినయం చేయబోతున్న కాజల్..!

Divya
చందమామ ఫేమ్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్గా ఒక గుర్తింపు తెచ్చుకున్న ఈమె స్టార్ హీరోలందరి సరసన కూడా నటించి మెప్పించింది. లక్ష్మీ కళ్యాణం సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన కాజల్ చందమామ సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత చిరంజీవితో కూడా కలిసి నటించిన ఈ ముద్దుగుమ్మ.. కెరియర్ పీక్స్ లో ఉండగానే తన బాల్య స్నేహితుడు ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ ముంబై కి చెందిన గౌతం కిచ్లు వివాహం చేసుకుంది . ఇదే ఏడాది పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.
అయితే ప్రస్తుతం ఈమె మళ్లీ సినిమాలలోకి రావడానికి తనను తాను మార్చుకుంటున్నట్లు తెలుస్తోంది.  కానీ పెళ్లి , పిల్లల తర్వాత కాజల్ అగర్వాల్ లో పూర్తి మార్పులు వచ్చేసాయి. నిజంగా కాజలేనా అన్నంత అనుమానం కూడా కలుగుతోంది. బరువు భారీ గా పెరిగిపోయింది.  కాజల్ అగర్వాల్ ఈ క్రమంలోనే తన పాతం మేకోవర్ ను  సృష్టించడం కోసం వరుసగా జిమ్ లో ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్న విషయం తెలిసిందే.  ఇకపోతే తాజాగా ఈమె  కమలహాసన్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న ఇండియన్ 2 సినిమాలో హీరోయిన్ గా ఎంపికైంది.
ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో ఈమె ద్విపాత్రాభినయం చేయబోతుందట.  అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడ లేదు.  కానీ ప్రస్తుతం ఈ వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో ప్రాచీన భారతీయ యుద్ధ కళ అయిన  కాలరైపయట్టు లో శిక్షణ కూడా తీసుకుంటుంది.  అంతేకాదు ఇండియన్ 2 సినిమా కోసం కత్తులు, కర్రలతో కూడా ప్రాక్టీస్ చేస్తోంది. మొత్తానికి అయితే ఈ సినిమాలో మునుపటిలాగా కనిపించడానికి కాజల్ చాలా గట్టి ప్రయత్నం చేస్తుందని తెలుస్తోంది.  మరి ఈ సినిమా ఈమెకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: