గబ్బర్ సింగ్ సినిమాలో.. అంత్యాక్షరి సీన్ ఆలోచన ఎవరిదో తెలుసా?
ఇక ఇలా పవన్ కళ్యాణ్ కెరియర్ లో చేసినవే కొన్ని సినిమాలే. అయితే ఇక ఆ సినిమాలలో సూపర్ హిట్ సాధించినవి మరికొన్ని మాత్రమే అని చెప్పాలి. ఇలా పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచిన చిత్రం ఏదైనా ఉంది అంటే గబ్బర్ సింగ్ అని చెప్పాలి. ఏకంగా హరి శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు వచ్చి ఇండస్ట్రీ హిట్టుగా నిలిచింది అని చెప్పాలి. ఇక ఇంతటి విజయానికి ప్రధాన కారణం సినిమాలోని కొన్ని కామెడీ సీన్లు అని చెప్పాలి. ముఖ్యంగా గబ్బర్ సింగ్ సినిమాలో ఉండే అంతాక్షరి సీన్ అయితే ఏకంగా సినిమాకు ఎంతో ప్లస్ పాయింట్ గా మారిపోయింది.
అయితే ఇక ఈ సన్నివేశానికి సంబంధించి ఒక ఆసక్తికర విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ముందుగా దర్శకుడు హరిష్ శంకర్ అంతాక్షరి సన్నివేశాన్ని తెరకెక్కించాలని అనుకోలేదట. కానీ పవన్ కళ్యాణ్ స్వయంగా ఇలాంటి సీన్ పెడితే బాగుంటుంది అని హరీష్ శంకర్ కు సూచించాడట. ఏకంగా రౌడీ గ్యాంగ్ తో అంతాక్షరి ఆడుతూ నిజం రాబట్టేలా సీన్ తీస్తే బాగా పండుతుందని ఇక పవన్ చెప్పడంతో హరీష్ శంకర్ ప్రొసీడ్ అయ్యాడట. చివరికి ఆ సీన్ పవన్ చెప్పినట్లుగానే తెరకెక్కించగా ఇక ఏకంగా సినిమా హిట్ కావడానికి ఆ సీను ఒక కారణంగా మారిపోయింది. ఇక ఆ సీన్ ను పవన్ చేయమని సూచించారు అన్న విషయాన్ని దర్శకుడు హరీష్ శంకర్ తన స్నేహితుల వద్ద పలుమార్లు ప్రస్తావించాడట.