ప్రశాంత్ నీల్ కి తారక్ ఫ్యాన్స్ రిక్వెస్ట్.. ఏంటంటే?

Purushottham Vinay
స్టార్ హీరోను అభిమానించే అభిమాని దర్శకుడిగా మారి తమ ఫేవరెట్ హీరోతో సినిమా తీస్తే ఎలా ఉంటుందో మన స్టార్ డైరెక్టర్ లు నిరూపించారు. పరశురామ్ పెట్ల తన అభిమాన హీరో సూపర్ స్టార్ మహేష్ బాబుతో సర్కారు వారి పాట తీసి ఇటీవల సూపర్ హిట్ కొట్టాడు. అలాగే హరీష్ శంకర్ కూడా పవన్ తో గబ్బర్ సింగ్ తీసి ఆ సినిమా ద్వారా ప్రూవ్ చేశారు. దబాంగ్ రీమేక్ గా తెరకెక్కిన గబ్బర్ సింగ్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల విషయంలో రికార్డులు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. అదే విధంగానే జూనియర్ ఎన్టీఆర్ కు కూడా ప్రశాంత్ నీల్ వీరాభిమాని కావడం గమనార్హం.తారక్ ప్రశాంత్ నీల్ కాంబో సినిమా షూటింగ్ కు చాలా సమయం ఉన్నా తారక్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్ వేరే లెవెల్ లో ఉందనే విషయం తెలిసిందే. ప్రశాంత్ నీల్ తారక్ ను కూడా డీ గ్లామర్ లుక్ లో చూపించనున్నప్పటికీ ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలవడం గ్యారంటీ అని ఎన్టీఆర్ అభిమానులు భావిస్తున్నారు.


సలార్ సినిమా రిలీజ్ కు ముందే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.అయితే ఎన్టీఆర్ కు జోడీగా క్రేజ్ ఉన్న హీరోయిన్ ను ఎంపిక చేయాలని అభిమానులు సూచనలు చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ సినిమాలలో హీరోయిన్ల ఎంపిక విషయంలో కొన్ని విమర్శలు అనేవి ఉన్నాయి. సలార్ సినిమాలో ప్రభాస్ కు జోడీగా నటిస్తున్న శృతి హాసన్ విషయంలో డార్లింగ్ అభిమానులు పూర్తిస్థాయిలో సంతృప్తితో లేరు. తారక్ కు మాత్రం పాపులారిటీ ఉన్న హీరోయిన్ ని ఎంపిక చేయాలని తారక్ అభిమానులు కోరుకుంటున్నారు.ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ రిక్వెస్ట్ ను పరిగణనలోకి తీసుకుని ప్రశాంత్ నీల్ తారక్31 వ సినిమాకి హీరోయిన్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. బాలీవుడ్ హీరోయిన్ ను ఎన్టీఆర్ కు జోడీగా ఎంపిక చేయాలని ఫ్యాన్స్ భావిస్తుండగా ప్రశాంత్ నీల్ మనస్సులో ఏ హీరోయిన్ వుందో తెలియాల్సి ఉంది. 2023 సంవత్సరం ఆగష్టు నుంచి ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని సమాచారం తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: