"వీర సింహారెడ్డి" మూవీ నుండి అదిరిపోయే అప్డేట్ విడుదల చేసిన మూవీ యూనిట్..!

Pulgam Srinivas
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వీర సింహా రెడ్డి అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో శృతి హాసన్ , బాలకృష్ణ సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా  , గోపీచంద్ మలినేని ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. వరలక్ష్మి శరత్ కుమార్ ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించనుండగా  దునియా విజయ్ ఈ మూవీ లో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ కి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుండి తమన్ సంగీతం అందించిన ఒక పాటను ఈ మూవీ యూనిట్ విడుదల చేసింది. ఆ పాటకు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ నుండి మరొక పాట విడుదలకు సంబంధించిన అప్డేట్ ను కూడా ఇది వరకే ఈ మూవీ యూనిట్ ప్రకటించిన విషయం మనకు తెలిసింది.
 


ఈ మూవీ నుండి సెకండ్ సింగిల్ అయినటు వంటి "సుగుణ సుందరి" అనే పాటను డిసెంబర్ 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే తాజాగా వీర సింహా రెడ్డి మూవీ యూనిట్ "సుగుణ సుందరి" సాంగ్ ను డిసెంబర్ 15 వ తేదీన ఉదయం 9 గంటల 42 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను విడుదల చేసింది. తాజాగా ఈ చిత్ర బృందం విడుదల చేసిన ఈ పోస్టర్ లో బాలకృష్ణ మరియు శృతి హాసన్ అదిరిపోయే డ్యాన్స్ స్టెప్ వేస్తూ ఉన్నారు. తాజాగా వీర సింహా రెడ్డి మూవీ యూనిట్ విడుదల చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం జనవరి 12 వ తేదీన విడుదల చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: