టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అందాల భామగా మంచి గుర్తింపు పొందిన శృతిహాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ప్రస్తుతం ఈమె కెరియర్ పరంగా ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతుంది అనే చెప్పాలి. టాలీవుడ్ ,హలీవుడ్ ,బాలీవుడ్, అని తేడా లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలో నటిస్తూ బిజీగా మారింది ఈమె. ఇక ఈ సంగతి పక్కన పెడితే శృతిహాసన్ వయసు ఇప్పుడు 36 సంవత్సరాలు.నాలుగు పదుల వయసు కు చేరువలో ఉన్న ఈమె ఇంకా పెళ్లి చేసుకోలేదు. అయితే తాజాగా ఈమె వివాహం పై షాకింగ్ కామెంట్లు చేసింది. ఇందులో భాగంగా ఈమె ఎక్కడకు వెళ్లినా తన పెళ్లి వార్తలని తీసుకొస్తున్నారని..
అలా అడగడంతో నాకు చాలా ఇబ్బందిగా ఉంది అని శృతిహాసన్ చెప్పింది. అసలు తనకు మరో రెండు మూడు సంవత్సరాల వరకు పెళ్లి చేసుకుని ఆలోచన అసలు లేదని కరాకండిగా తెగించి చెప్పింది. దీనితో శృతిహాసన్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వేదికగా వైరల్ గా మారాయి. దీంతో ఈమెపై నేటిజన్లు రకరకాల కామెంట్లు సైతం చేస్తున్నారు. అయితే దీంతో కొందరు అదేంటి శృతిహాసన్ అంత మాట అనేసింది... ముసలి దానివి అయ్యాక పెళ్లి చేసుకుంటావా ఏంటి అని సెటైర్లు కామెంట్స్ కూడా వేస్తున్నారు. శృతిహాసన్ డూడల్ ఆర్టిస్ట్ శాంతను తో ప్రేమాయడం నడిపిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.
ప్రస్తుతం వీరిద్దరూ ఒకే ఇంటిలో ఉంటూ లివింగ్ రిలేషన్ షిప్ ఎంజాయ్ చేస్తున్నారు .అంతే కాదు రెండేళ్లకు పైగా వీరిద్దరూ రిలేషన్షిప్ ను కొనసాగించడం గమనార్హం. ఇదిలా ఉంటే తాజాగా గత కొన్ని రోజులుగా వీరిద్దరూ విడిపోయారు అంటూ సోషల్ మీడియాలో అనేక రకమైన వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై శృతిహాసన్ కానీ శాంతను కానీ ఇప్పటికీ స్పందించలేదు. దీంతో చాలామంది ఈ వార్త నిజం అని నమ్ముతున్నారు.ఇక ఇది నిజమా కాదా అన్న విషయం తెలియాలి అంటే శృతిహాసన్ నోరు విప్పాల్సిందే...!!