టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా మంచి పేరు సంపాదించుకున్న సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇప్పుడు సమంతా మయూసైటిస్ అని వ్యాధితో బాధపడుతున్నారు. ఇటీవల కొరియాకు చికిత్స నిమిత్తం వెళ్ళింది సమంత. దాదాపు వారం రోజులు అవుతున్న కూడా ఇప్పటికీ అక్కడే ఉండి చికిత్స తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మరో వారం గడిస్తే కానీ సమంత తిరిగి వచ్చే అవకాశాలు లేవు అనే వార్తలు సైతం వినిపిస్తున్నాయి. ఇటీవల ఆమె నటించిన యశోద సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ ను సొంతం చేసుకుంది.
త్వరలోనే శేఖర్ దర్శకత్వంలో సమంత నటించిన శాకుంతలం సినిమా కూడా విడుదల కు సిద్ధంగా ఉంది. ఇక ఆ సినిమా ప్రమోషన్స్ కోసం సమంత హాజరయ్యే అవకాశం ఉంది అనే వార్తలు సైతం ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఈ సమయంలోనే సమంత మేనేజర్ కి నాగచైతన్య ఫోన్ చేసి సమంత ఆరోగ్యం ఎలా ఉంది అనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేశాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదివరకు సమంత మేనేజర్ తో నాగచైతన్యకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇక ఆ సన్నిహిత సంబంధాలతోనే చైతన్య సమంత మేనేజర్ కి ఫోన్ చేసి ఆమె ఆరోగ్యం గురించి మాట్లాడాడట నాగచైతన్య.
ఆయన మాట్లాడుతూ ఇంకెన్నాళ్లు చికిత్స తీసుకోవాలి ఆమె ఎప్పటి వరకు సినిమాలకు దూరంగా ఉంటుంది అనే విషయాలను సమంత మేనేజర్ తో మాట్లాడి తెలుసుకున్నాడట నాగచైతన్య. అక్కినేని ఫ్యామిలీ మాత్రం ఈ విషయాన్ని కొట్టి పారేస్తున్నారు అని చెప్పాలి. నాగచైతన్య మరియు సమంతా విడాకులు తీసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. విడాకులు తీసుకున్న తర్వాత వీరిద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేకుండానే ఉన్నారు .దీంతో వీరిద్దరూ విడాకులు తీసుకొని దూరంగా ఉన్నారు. కాబట్టి నాగచైతన్య సమంత ఆరోగ్యం గురించి ఫోన్ చేసి ఉండడు అనే కామెంట్లు సైతం వినిపిస్తున్నాయి .దీంతో వీరి అభిమానులు నిజంగా నాగచైతన్య సమంత ఆరోగ్యం గురించి తెలుసుకున్నాడా లేదా అన్న ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి..!!