ఆ దేశంలో "వాల్తేరు వీరయ్య" రెండు సాంగ్స్ ను షూట్ చేయబోతున్న మూవీ యూనిట్..!

Pulgam Srinivas
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస మూవీ లతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి ఈ సంవత్సరం రెండు మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. అందులో మొదటిగా మెగాస్టార్ చిరంజీవి "ఆచార్య" మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. కొనటాల శివ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ మూవీ భారీ అంచనాల నడుమ ధియేటర్ లలో విడుదల అయ్యింది. భారీ అంతరాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకో లేక పోయింది. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన గాడ్ ఫాదర్ మూవీ థియేటర్ లలో విడుదల అయింది.


ఈ మూవీ పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం చిరంజీవి , బాబి దర్శకత్వం లో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో తేరక్కెక్కుతున్న వాల్తేరు వీరయ్య అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. శృతి హాసన్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , బాబీ సింహ ఈ మూవీ లో ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. మాస్ మహారాజా రవితేజ ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించనుండగా , దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం జనవరి 13 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ ఫుల్ స్పీడ్ లో వాల్తేరు వీరయ్య సినిమా షూటింగ్ ను పూర్తి చేస్తుంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ రెండు పాటలు మినహా మొత్తం పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఈ రెండు పాటల కోసం చిత్ర బృందం డిసెంబర్ 9 వ తేదీన  ఫ్రాన్స్ వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: