కమల్ తో సహజీవనం పై క్లారిటీ ఇచ్చిన స్టార్ నటి...!!

murali krishna
విలక్షణ నటుడు కమల్ హాసన్. ఈ పేరుకు స్పెషల్ ఇమేజ్ ఉంది. ఆయన సినిమా థియేటర్లలోకి వస్తుందంటే చాలు ఫ్యాన్స్ కి పండగే. ఎందుకంటే తన నటనతో ప్రేక్షకుల్ని మాయచేస్తాడు. హీరోయిన్లతో అద్భుతమైన కెమిస్ట్రీ వర్కౌట్ చేస్తాడు. ఇక లిప్ లాక్, రొమాంటిక్ సీన్స్ లో అయితే రెచ్చిపోతాడు. ఇక ఇండస్ట్రీలోనూ సహజీవనం అనే కాన్సెప్ట్ ని తీసుకొచ్చింది కమల్ హాసనే! ఇప్పటివరకు పలువురు హీరోయిన్లతో లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్న కమల్.. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ తో రిలేషన్ లో ఉన్నారని గత కొంతకాలం నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు వాటిపై సదరు బ్యూటీ స్పందించింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. విలక్షణ నటుడు కమల్ హాసన్ లైఫ్ చాలా డిఫరెంట్. 1960ల్లోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. 70 ఏళ్లకు చేరువవుతున్నా సరే ఇంకా నటుడిగా అదరగొడుతున్నాడు. ఈ ఏడాది ‘విక్రమ్’ సినిమాతో వచ్చిన కమల్.. చాన్నాళ్ల తర్వాత బంపర్ హిట్ కొట్టాడు. ఈ మూవీ రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించడం విశేషం. ఇక ప్రస్తుతం ‘ఇండియన్ 2’ (తెలుగులో భారతీయుడు 2) షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. అయితే కమల్ గత కొన్ని సినిమాలు పరిశీలిస్తే… నటి పూజాకుమార్ వరుసగా విశ్వరూపం, ఉత్తమవిలన్, విశ్వరూపం 2 తదితర సినిమాల్లో కనిపిస్తూ వచ్చింది.ఇక ఈ సినిమాల్లో నటించడమే కాకుండా కమల్ తో రొమాంటిక్, లిప్ లాక్ సీన్స్ కూడా చేసింది. కమల్ ఫ్యామిలీతో మంచి బాండింగ్ కూడా మెంటైన్ చేస్తూ వస్తోంది. వీళ్లు కలిసి దిగిన ఫొటో కూడా ఒకటి వైరల్ గా మారింది. దీంతో కమల్-పూజా కుమార్ సహజీవనం చేస్తున్నారనే టాక్ వచ్చింది. దానికి తగ్గట్లే గతంలో హీరోయిన్ సారిక, వాణి గణపతి, గౌతమిలతో కమల్ రిలేషన్ షిప్ మెంటైన్ చేశాడు. ఈ క్రమంలోనే పూజాతో కమల్ రిలేషన్ గురించి టాక్ వచ్చింది. ఇప్పుడు ఈ వార్తలపై స్పందించిన పూజాకుమార్.. ‘కమల్ హాసన్ తో నేను ఐదేళ్ల నుంచి సినిమాలు చేస్తూ వస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యులు కూడా నాకు బాగా క్లోజ్ అయ్యారు. అందుకే ఈ రూమర్స్ వస్తున్నాయి. మా మధ్య ఎలాంటి ఎఫైర్ లేదు. దయచేసి ఇలాంటి పుకార్లు క్రియేట్ చేయొద్దు’ అని చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: