ఆ స్టార్ నటి తో డేటింగ్ చేస్తున్న కమల్ హాసన్...?
అప్పటి నుంచి సినిమాలే జీవితంగా సినిమా ఇండస్ట్రీలో వెలుగొందుతున్నారు. ఆయన వయసు 70 దాటినా ఇంకా సినిమాల్లో నటిస్తూ తన సత్తా ను చాటుతున్నారు. ఇటీవలే విక్రమ్ సినిమాతో బాక్సాఫీసును బద్దలు చేశాడు కమల్ హాసన్.
కమల్ హాసన్ సినిమాలు ఎంత వెరైటీగా ఉంటాయో.. ఆయన వ్యక్తిగత జీవితం కూడా అలాగే ఉంటుంది. ఆయన ఇప్పటికే నటి గౌతమితో సహజీవనం చేసి ఇద్దరూ కూడా విడిపోయారు. అంతకు ముందే తన మొదటి భార్యతో విడిపోయాడు కమల్ హాసన్. ప్రస్తుతం ఒంటరిగానే ఉంటున్న కమల్ హాసన్ మరో స్టార్ హీరోయిన్ తో డేటింగ్ చేస్తున్నాడంటూ వార్తలు కూడా వస్తున్నాయి. అయితే.. నటి పూజా కుమార్ తో కమల్ హాసన్ సహజీవనం చేస్తున్నాంటూ ఇటీవల వార్తలు అయితే వచ్చాయి. దానికి కారణం.. కమల్ నటించిన విశ్వరూపం, విశ్వరూపం 2, ఉత్తమ విలన్ లాంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించిందటా పూజా కుమార్ .
వరుసగా కమల్ తో పూజా కుమార్ సినిమాల్లో కూడా నటించడంతో వాళ్లిద్దరి మధ్య ఏదో ఉందనే ప్రచారం స్టార్ట్ అయింది. ఇద్దరూ కలిసి రొమాంటిక్ సీన్లలోనూ నటించారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య మంచి బాండింగ్ కూడా ఉంది. ఇద్దరూ లిప్ లాక్ లోనూ నటించడంతో ఇద్దరి మధ్య ఏదో ఉందనే కూడా ప్రచారం ప్రారంభం అయింది. అయితే.. ఈ వార్తలపై పూజా కుమార్ వెంటనే స్పందించింది. నేను దాదాపుగా ఐదేళ్ల నుంచి కమల్ హాసన్ తో సినిమాలు చేస్తూ వస్తున్నా. ఆయన ఫ్యామిలీ మెంబర్స్ నాకు ఎంతో క్లోజ్. అలా అని.. మా మధ్య ఎలాంటి అఫైర్ లేదు.. ఇలాంటి రూమర్స్ ను క్రియేట్ చేయకండి అని పూజా కుమార్ ఇటీవల మీడియా స్టేట్ మెంట్ ఇచ్చి.. వాళ్ల మధ్య వస్తున్న పుకార్లకు పుల్ స్టాప్ అయితే పెట్టారు.