మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్న కేతిక...!!

murali krishna
కేతిక శర్మ తేలుగు సినిమా రొమాంటిక్‌ ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టింది. కేతిక శర్మ చదువు పూర్తికాగానే మోడలింగ్‌ లో కి వచ్చి ఆమె  2016 లో నటించిన 'థగ్‌ లైఫ్‌ (2016)' వీడియోతో పాపులర్‌ అయ్యి దబ్ స్మాష్ వీడియోలు, మోడలింగ్, యూట్యూబ్ వీడియోలతో సినిమాలలోకి రాకముందే సోషల్ మీడియాలో సూపర్ క్రేజ్ ను అయితే దక్కించుకుంది
మరియు ఆమె అల్లు అర్జున్‌తో కలిసి 'ఆహా' ఓటీటీ కోసం చేసిన ప్రోమోలో నటించింది. అయితే తెలుగు తెరకి ఈ మధ్య కాలంలో పరిచయమైన అందాల కథానాయికల లో కేతిక కూడా ఒకరు. పూరి జగన్నాథ్ బ్యానర్ నుంచి ఒక హీరోయిన్ వచ్చిందంటే .. పూరి మెచ్చిన బ్యూటీ అంటే తప్పకుండా మేటర్ అయితే ఉంటుందని అంతా అనుకుంటారు.
అనుకున్నట్టుగానే ఈ సుందరి 'రొమాంటిక్' సినిమాకి సంబంధించిన ఫస్టు పోస్టర్ తోనే కుర్ర మనసుల్లో కుంపట్లు రాజేసింది. తన అభిమాను ల జాబితా లో చేర్చేసుకుందట.గుమ్మడి పువ్వులా ఉన్న కేతికను చూడగానే కుర్రాళ్లకు కుదురు .. కునుకు కూడా లేకుండా పోయాయి.
గ్లామర్ పరంగా .. నటన పరంగా కృతి శెట్టి .. శ్రీలీలతో పాటు, తన జోరును చూపించడం ఖాయమని కూడా అంతా అనుకున్నారు. గ్లామర్ పరంగా నూటికి నూటొక్క మార్కులు పడ్డాయిగానీ, కథాకథనాల పరంగా సినిమాలు అయితే ఫ్లాప్ అయ్యాయి.
దాంతో ఈ బొద్దుగుమ్మ కాస్త వెనకబడింది. కావున ఇక ఇప్పుడు ఆమె అవకాశాల కోసం వెయిట్ చేస్తోంది. అవకాశం రావాలి .. దాని వెనుకే సక్సెస్ కూడా కావాలి.
ఈ రెండూ రావాలంటే అందుకు తగిన అదృష్టం కూడా ఉండాలి. తనని తప్పించుకుని తిరుగుతున్న అదృష్టాన్ని వెతికి పట్టుకునే పనిలోనే అయితే ఆమె ఉంది. ఆ ప్రయత్నం లో భాగంగానే తన లేటెస్ట్ పిక్స్ వదులుతోంది. కేతిక అందాల గని అనడంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: