మంచు విష్ణు... శ్రీను వైట్ల మూవీ ఆగిపోయినట్లేనా..?

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరో లలో ఒకరు అయినటు వంటి మంచు విష్ణు గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మంచు విష్ణు ఇప్పటికీ అనేక మూవీ లలో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపు ఏర్పాటు చేసుకున్నాడు. తాజాగా మంచు విష్ణు "జిన్నా" అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో పాయల్ రాజ్ పూ , సన్ని లియోన్ హీరోయిన్ లుగా నటించారు. పర్వాలేదు అనే రేంజ్ అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన జిన్నా మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయింది. బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయిన జిన్నా మూవీ కొన్ని రోజుల క్రితమే "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

ప్రస్తుతం జిన్నా మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో "ఓటిటి" ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఇలా ఉంటే చాలా రోజుల క్రితం మంచు విష్ణు హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వం లో డబల్ డోస్ అనే మూవీ ని అనౌన్స్ చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి సంబంధించిన ఒక పోస్టర్ ను కూడా ఈ చిత్ర బృందం విడుదల చేసింది. కానీ ఆ తర్వాత ఈ సినిమాకు సంబంధించిన ఇలాంటి అప్డేట్ లను మూవీ యూనిట్ విడుదల చేయలేదు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ దాదాపుగా ఆగిపోయినట్లే అని ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఇది వరకే మంచు విష్ణు ,  శ్రీను వైట్ల కాంబినేషన్ లో డి మూవీ తెరకెక్కి బ్లాక్ బాస్టర్ విజయం అందుకుంది. దానితో డబల్ డోస్ మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ మూవీ ఆగిపోయిందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: