ఈసారి సంక్రాంతికి విడుదల కాబోయే ఆ 4 క్రేజీ సినిమాల విడుదల తేదీలు ఇవే..?

Pulgam Srinivas
ప్రతిసారి సంక్రాంతి లాగానే ఈసారి సంక్రాంతి పండగకు కూడా అద్భుతమైన క్రేజ్ ఉన్న సినిమాలు విడుదలకు రెడీగా అయ్యాయి. ఆ సినిమాలు ఏవి ... అవి ఏ తేదీల్లో విడుదల కాబోతున్నాయో తెలుసుకుందాం. తమిళ సినిమా ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయినటువంటి అజిత్ ప్రస్తుతం తునివు అనే మూవీలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీని వచ్చే సంవత్సరం జనవరి 11వ తేదీన సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. మరి కొన్ని రోజుల్లోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలబడబోతుంది. నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం వీర సింహా రెడ్డి అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. శృతి హాసన్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , గోపీచంద్ మలినేని ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు.

మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం జనవరి 12 వ తేదీన సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. కోలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న హీరో లలో ఒకరు అయినటు వంటి తలపతి విజయ్ ప్రస్తుతం వరిసు అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని తెలుగు లో వారసుడు పేరుతో విడుదల చేయనున్నారు. వంశీ పైడిపల్లి ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం జనవరి 12 వ వదిన విడుదల చేయనున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన మరికొన్ని రోజుల్లో రాబోతుంది. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వాల్తేరు వీరయ్య అనే మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. బాబి ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తూ ఉండగా , శృతి హాసన్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం జనవరి 13 వ తేదీన విడుదల చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: