కెరియర్ ప్రారంభంలో భారీ షేమింగ్ కు గురి అయ్యాను... ప్రియాంక చోప్రా..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ , మోస్ట్ గార్జియస్ అండ్ మోస్ట్ హాటెస్ట్ హీరోయిన్ లలో ఒకరు అయినటు వంటి ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రియాంక చోప్రా ఇప్పటికీ అనేక బాలీవుడ్ సినిమాలలో నటించి ప్రపంచవ్యాప్తంగా తనకంటూ అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం ప్రియాంక చోప్రా టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన జంజీర్ మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ని తెలుగు లో తుఫాన్ పేరుతో విడుదల చేశారు. మంచి అంచనా నడుమ హిందీ మరియు తెలుగు భాషలలో విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏ మాత్రం అలరించ లేక పోయింది.

కాకపోతే ఈ మూవీ ద్వారా ఈ ముద్దు గుమ్మ కు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు లభించింది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఎంతో మంది బాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించి ఎన్నో సంవత్సరాల పాటు బాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగిన ప్రియాంక చోప్రా తన కెరియర్ ప్రారంభంలో బాడీ షేవింగ్ కు గురైనట్లు తాజాగా తెలిపింది. కెరియర్ ప్రారంభంలో సహనటుల  కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చేది అని తెలియజేసింది. అలాగే తనని డస్కీ అని పిలిచేవారు అని ప్రియాంక చోప్రా పేర్కొంది. అది మాత్రమే కాకుండా నల్లపిల్లి అని వెటకారంగా కూడా పిలిచేవారు అని ఆనాటి అనుభవాలను వివరించింది. తాను తగినంత అందంగా లేనని అప్పుడు అనిపించింది అని , సహనటులు పొందిన వేతనంతో  కేవలం 10 శాతం కూడా తాను పొందలేడు అని ప్రియాంక చోప్రా వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: