సాధారణంగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు అందరూ వారి నెక్స్ట్ సినిమాలను లాంఛనంగా సెట్స్ పైకి తీసుకువెళ్లి షూటింగ్ పనులను మొదలు పెడతారు. కానీ మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం కూల్ గా ఆయన 30 ప్రాజెక్టు పనుల్లో బిజీగా ఉన్నాడు. ఆర్ఆర్ సినిమాతో ఇండియా వైడ్ గా ఆకట్టుకున్న ఈయన ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులకు అత్యంత దగ్గర అయ్యాడు అని చెప్పాలి. ఈ సినిమాతో పాన్ ఇండియా చేరిపోయాడు జూనియర్ ఎన్టీఆర్. ప్రస్తుతం ఈ సినిమాతో ఆయనకి వచ్చిన క్రేజ్ ను ఎంజాయ్ చేస్తున్నాడు అని చెప్పాలి .
అయితే ప్రస్తుతం ఈయన తదుపరి సినిమా విషయంలో మిగతా స్టార్స్ స్పీడ్ పనిచేస్తుంటే ఈయన మాత్రం చాలా నెమ్మదిగా అడుగులు వేస్తున్నాడు. రాజమౌళి సినిమాతో బ్లాక్ బస్టర్ జోష్తో ఉన్న ఎన్టీఆర్ అదే ఉత్సాహంతో స్టార్ట్ డైరెక్టర్ కూడా చాలాతో మరో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ని చేస్తాడని అందరూ అనుకున్నారు. కానీ అది జరగలేదు. అనేక కారణాలవల్ల ఈ ప్రాజెక్టు నెలలో తరబడి ఆగిపోతూనే వస్తుంది. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా దీనికి సంబంధించి డైలాగ్ మోషన్ టీజర్ ని విడుదల చేయడం జరిగింది. అప్పటినుండి ఈ సినిమాకి సంబంధించిన ఒక్క అప్డేట్ కూడా మేకర్స్ ప్రకటించలేదు ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది
అనే విషయాన్ని మాత్రం ఇప్పటివరకు బయట పెట్టలేదు. దీనికి సంబంధించిన అప్డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందని ఎన్టీఆర్ అభిమానులు తెలియదు చూస్తున్నారు. ఇదిలా ఉంటే ఇక ఇప్పుడు ఎన్టీఆర్ వచ్చే వారం ఆయన కుటుంబంతో కలిసి యుఎస్ కి ప్రత్యేక వెకేషన్ కు వెళ్తున్నారు అని వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. అయితే గత కొన్ని రోజులుగా వరిసభ్య షెడ్యూల్ కారణంగా ఫ్యామిలీతో టైం మిస్ అయిన ఎన్టీఆర్ ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. దాని అనంతరం తిరిగి వచ్చిన తర్వాత కొరటాల ప్రాజెక్టుని మొదలు పెట్టబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కొరటాల స్క్రిప్ట్ కూడా లాక్ చేయడం జరిగిందట. దీని తర్వాత ఎన్టీఆర్ ఎవరితో సినిమా చేయబోతున్నాడు అనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదు. అయితే ఎన్టీఆర్ తన 31వ ప్రాజెక్టు ఎవరితో తీస్తాడో అనేది మాత్రం ఇంకా చెప్పలేదు. దీంతో ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా ఏంటి ఇలా ఉంటుంది అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..!!