పల్లెలకే రాబోతున్న థియేటర్లు..200+ సీటింగ్ కెపాసిటీతో..!

Divya
సినీ పరిశ్రమలో కరోనా వచ్చిన తర్వాత కార్మికుల పరిస్థితి అతలాకుతలమైన విషయం తెలిసిందే. ఒక కార్మికులనే కాదు సినిమాలు లేక సెలబ్రిటీలు, హీరోలు,  హీరోయిన్లు సైతం ఎన్నో ఇబ్బందులు పడ్డారు.  ముఖ్యంగా పెద్ద పెద్ద హీరోలు , హీరోయిన్లను పక్కన పెడితే.. చిన్న చిన్నగా అప్పుడే ఇండస్ట్రీలోకి వచ్చిన చాలామంది అవకాశాలు లేక.. సినిమా షూటింగ్ లు జరగక.. తినడానికి తిండి కూడా దొరకక.. రోడ్డున పడిన దుస్థితి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే చిరంజీవి లాంటి పెద్ద పెద్ద స్టార్ హీరోలు తమ కు తోచిన విధంగా సహాయం చేశారు.
అయితే కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత షూటింగ్ లు ప్రారంభమయ్యాయి. థియేటర్లో కూడా చాలా కళకళలాడుతున్నాయి. అయితే టికెట్ ధరలు ఎక్కువగా ఉండడం.. పైగా పార్కింగ్ , స్నాక్స్ అంటూ 500 రూపాయలు కేవలం  ఒకరు సినిమా చూడడానికే అవుతుండడంతో .. సామాన్య ప్రజలు పట్టణాలకు.. థియేటర్లకు వెళ్లి సినిమా చూడలేకపోతున్నారు.  దీంతో టికెట్ ధరలు తగ్గించాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా కుదరలేదు. అందుకే నేరుగా ప్రభుత్వం దిగివచ్చి టికెట్ ధరలను తగ్గించింది.  అయితే టికెట్ ధరలు తగ్గించడం వల్ల తమకు నష్టం జరుగుతుందని.. ఇండస్ట్రీ పెద్దలు ప్రభుత్వానికి తమ గోడు వినిపించిన విషయం తెలిసిందే.
అయితే ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలు పట్టణాలకు వెళ్లి సినిమాలు చూడలేకపోతున్న నేపథ్యంలో థియేటర్లనే గ్రామాలకు తీసుకెళ్లబోతోంది ఈ ప్రభుత్వం.  ఒకవేళ మళ్లీ ఇదే ప్రభుత్వం వస్తే సినిమా హాళ్ళ కొరత ఎప్పటికైనా పరిష్కారం అవుతుంది. గ్రామీణ ప్రాంతాలలో 200 + సీటింగ్ కెపాసిటీతో లక్ష థియేటర్లను నిర్మించడానికి బి ఎం సి ఎస్ సి మరియు ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖ ఒప్పందంపై సంతకం చేసాయట. ఇదే ప్రభుత్వమే వస్తే మళ్ళీ సినిమా హాల్ల కొరత ఉండదు అని కేంద్రం యొక్క చొరవతో రాబోయే సంవత్సరాలలో విజయవంతంగా అమలు చేయబడుతుందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: