రవితేజ తో మరో సినిమాకు రెడీ అంటున్న డైరెక్టర్..!

Satvika
క్రాక్ తర్వాత రవితేజ కు ఒక్క హిట్ కూడా పడ లేదు..అయిన చేతిలో వరుస సినిమాలు ఉన్నాయి. ఇప్పటికే తన తాజా చిత్రం 'ధమాకా' ను రిలీజ్కు రెడీ చేస్తోన్న ఈ స్టార్ హీరో.. టైగర్ నాగేశ్వర్ రావు, రావణాసుర వంటి సినిమాల ను లైన్లో పెట్టాడు. ఇలా వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న రవితేజ, మరో సినిమా 'వాల్తేరు వీరయ్య'లోనూ నటిస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ సినిమా లో ఓ కీలక పాత్ర లో రవితేజ కనిపిస్తాడు.


అయితే గతంలో రవితేజ తో ఓ సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు సంపత్ నంది, ఇప్పుడు మరోసారి ఆయన తో చేతులు కలిపేందుకు రెడీ అవుతున్నాడట. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన 'బెంగాల్ టైగర్' మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. కాగా, ఇప్పుడు మరోసారి రవితేజ కోసం సంపత్ నంది ఓ సాలిడ్ కథ ను రెడీ చేస్తున్నట్లు గా తెలుస్తోంది. అయితే, సంపత్ నంది మరో హీరో గోపీచంద్ కోసం ఓ కథను రాసుకున్నాడ ని.. కానీ, ఈ కథకు రవితేజ అయితేనే పర్ఫెక్ట్గా ఉంటుంద ని ఆయన భావిస్తున్నాడ ట. అందుకే ఈ కథ ను రవితేజ కు వినిపించేందుకు సిద్ధమవుతున్నాడట.నిర్మాత నిరంజన్ రెడ్డి మాస్ రాజా రవితేజతో ఓ సినిమా చేసేందుకు ఎప్పటినుండో ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమం లో సంపత్ నంది డైరెక్షన్లో రాబోయే ఈ సినిమా ను ఆయనే ప్రొడ్యూస్ చేస్తారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మరి ఈ వార్త లో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ.. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. నిజంగా నే సంపత్ నంది, రవితేజ కాంబినేషన్ మరోసారి హిట్ అవుతుందో లేదో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: