టాలీవుడ్ సీనియర్ హీరో నటసింహ నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు .ఈ వయసులో కూడా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు బాలకృష్ణ. ఈ మధ్యకాలంలో ఆయన రేంజ్ మరింత పెరిగిందని చెప్పాలి. ఈ వయసులో కూడా సినిమాలను ప్రకటిస్తూ పాపులారిటీని దక్కించుకుంటున్నారు బాలయ్య. ఒకవైపు సినిమాలు మరువైపు రాజకీయాలు అంతేకాదు ఇంకోవైపు ఆహాలో ప్రసారమవుతున్న అన్ స్టాప్ బుల్ షో కి హోస్టుగా కూడా వ్యవహరిస్తున్నారు బాలకృష్ణ. ఇటీవల మొదటి సీజన్ పూర్తి చేసుకున్న ఈ షో ప్రస్తుతం రెండవ సీజన్ కూడా మొదలైంది.
అంతేకాదు ఇప్పటికే నాలుగు ఎపిసోడ్లను కూడా పూర్తి చేసుకుంది ఈ షో. ఇదిలా ఉంటే ఇటీవల గోపీచంద్ మలి నేని దర్శకత్వంలో బాలయ్య వీర సింహారెడ్డి సినిమా చేస్తున్నారు. దీనికిగాను జనవరి 12న బాలయ్య సినిమాను థియేటర్లలో విడుదల చేయడానికి సర్వం సిద్ధం చేస్తున్నారు .అయితే బాలయ్య ఈ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలోనే మరొక డైరెక్టర్ అనిల్ రావిపూడి తో ఆయన తదుపరి సినిమాని కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఈ సినిమాలో బాలయ్య విజయ్ దేవరకొండ హీరోగా నటించిన టాక్సీవాలా సినిమాలో హీరోయిన్ గా నటించిన ప్రియాంక జవాల్కర్ ను తీసుకుంటున్నారట.
ఇకపోతే డిసెంబర్ 8 నుంచి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలోని బాచుపల్లి లో ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కూడా ప్రారంభించబోతున్నారట .అయితే బాలయ్య సినిమాలో ప్రియాంక మరొక హీరోయిన్గా ఎంపిక చేయడంతో ఆమె అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇక బాలయ్య సినిమాతో ఈ అమ్మడికి మంచి హిట్ పడితే వరుస ఆఫర్లు కచ్చితంగా వస్తాయని అంటున్నారు. ఇదిలా ఉంటే ఇక ఈ సినిమాలో బాలకృష్ణ కూతురి పాత్రలో యంగ్ హీరోయిన్ అయిన శ్రీ లీల నటిస్తున్న సంగతి తెలిసింది కదా.. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందని ప్రేక్షకులు తెగ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..!!