టాలీవుడ్ రౌడీ హీరోగా మంచి పేరు తెచ్చుకున్న నటుడు విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అయితే ఇటీవల టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తనకెక్కిన లైగర్ సినిమాతో విజయ్ దేవరకొండ మరో ఫ్లాప్ ని తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ ఎంతో కష్టపడినప్పటికీ ఆశించిన ఫలితాన్ని దక్కించుకోలేకపోయింది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ... సమంతతో కలిసి ఖుషి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే . అయితే ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన
ప్రీ ప్రొడక్షన్ పనులు అన్నీ కూడా జరుగుతున్నాయి .కాగా ఈ సినిమాకు నిన్నుకోరి దర్శకుడు శివ నిర్మాణ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో భాగంగా విజయ్ దేవరకొండ సరసన మరో కీలక పాత్రలో కృతి శెట్టి కూడా నటిస్తుందని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఇప్పటికే ఆమె డేట్స్ విజయ్ సినిమాకు ఉన్నాయట.విజయ్ సరసన ఈ సినిమాలో కృతి శెట్టి నెగిటివ్ షేడ్స్ ఉన్న ఒక పాత్రలో నటించనుందని సమాచారం వినబడుతుంది. ఇదిలా ఉంటే రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఈ సినిమాకు ముందు జనగణమన సినిమా చేయాల్సి ఉంది .
కానీ లైగర్ సినిమా తర్వాత ఏర్పడిన ఫలితాల కారణంగా ఆ సినిమా చేయలేకపోయాడు. దాంతో ఆ సినిమా ఆగిపోవడం జరిగింది. అయితే ఇటీవల రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమా చిత్ర నిర్మాణంలో నెలకొన్న బడ్జెట్ తదితర వ్యవహారాలను గురించి దర్శకుడు పూరి జగన్నాథ్ మరియు చార్మిల తో పాటు విజయ్ దేవరకొండ ను కూడా అవినీతి నిరోధక శాఖ కొన్ని అనుమానాల వల్ల వారిని విచారించిన సంగతి తెలిసిందే. దీనికిగాను జనగణమన సినిమా ఉండదని వార్తలు వస్తున్నాయి. ఇకపోతే రౌడీ హీరో విజయ్ దేవరకొండ మరియు స్టార్ హీరోయిన్ సమంత జంటగా నటిస్తున్న ఖుషి సినిమా కోసం వీరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ప్రస్తుతం సమంత మయోసైటిస్ అనే ఒక వ్యాధితో బాధపడుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే కదా ..ఇందుకుగానూ సమంత ఆరోగ్యం బాగోలేదని ఈ సినిమా షూటింగ్ ను ఆపేయడం జరిగింది .మళ్లీ తిరిగి ఈ సినిమా షూటింగ్ ను ఎప్పుడు ప్రారంభిస్తారు అనేది తెలియాల్సి ఉంది.!!