అలా బ్రతకడం చాలా కష్టం... శృతిహాసన్..!

Pulgam Srinivas
కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శృతి హాసన్ ఇప్పటికే ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీ లలో హీరోయిన్ గా నటించి ఎంతో మంది అభిమానులు మనసు దోచుకుంది. ఈ ముద్దు గుమ్మ ఎన్నో తెలుగు సినిమా లలో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా ఎన్నో సంవత్సరాల పాటు స్టార్ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగించింది. ఇది ఇలా ఉంటే  శృతి హాసన్ ప్రస్తుతం వాల్తేరు వీరయ్య , వీర సింహా రెడ్డి  సలార్ మూవీ లలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇందులో వాల్తేరు వీరయ్య , వీర సింహా రెడ్డి మూవీ లు వచ్చే సంవత్సరం సంక్రాంతి కి విడుదల కానున్నాయి. సలార్ మూవీ షూటింగ్ ప్రస్తుతం ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. వాల్తేరు వీరయ్య మూవీ లో చిరంజీవి హీరోగా నటిస్తూ ఉండగా , బాబీ ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ మూవీ ని నిర్మిస్తోంది.  వీర సింహా రెడ్డి మూవీ లో బాలకృష్ణ హీరో గా నటిస్తున్నాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.

సలార్ మూవీ లో ప్రభాస్ హీరోగా నటిస్తున్నాడు. ప్రశాంత్ నీల్ ఏ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూడు మూవీ లు కనక విజయాలు సాధించినట్లు అయితే శృతి హాసన్ క్రేజ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అమాంతం పెరిగే అవకాశం ఉంది. ఇది ఇలా ఉంటే తాజాగా శృతి హాసన్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. తాజాగా శృతి హాసన్ ఎదుటి వాళ్లకు నచ్చేలా బ్రతకడం  జీవితంలో చాలా కష్టమైన పని అని చెప్పుకొచ్చింది. అందరికీ నచ్చేలా డ్రెస్ లను వేసుకోవడం ,  మాట్లాడడం  మరియు  ప్రవర్తించడం ఇవి జీవితంలో అత్యంత కష్టమైన పనులు అని తాజాగా చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: