"హిట్ 2" డిజిటల్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..?

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న హీరో లలో ఒకరు అయినటు వంటి అడవి శేషు తాజాగా హిట్ ది సెకండ్ కేస్ అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి శైలేష్ కొలను దర్శకత్వం వహించగా , మీనాక్షి చౌదరి ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే హిట్ ది ఫస్ట్ కేస్ మూవీ సూపర్ హిట్ ను అందుకోవడం , అలాగే వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న అడవి శేషు ఈ మూవీ లో హీరో గా నటించడం తో ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలా భారీ అంచనాల నడుమ డిసెంబర్ 2 వ తేదీన ఈ మూవీ థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ కి థియేటర్ లలో విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ పాజిటివ్ టాక్ లభించింది. దానితో ఈ మూవీ కి మొదటి రోజు అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర లభించాయి. అలాగే ఆ తర్వాత కూడా ఈ మూవీ కి స్టడీగా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ లు లభిస్తున్నాయి.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ దగ్గర విజయవంతంగా కొనసాగుతున్న ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ యొక్క డిజిటల్ హక్కులను ప్రముఖ "ఓ టి టి" సంస్థలలో ఒకటి అయినటు వంటి అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ దక్కించుకున్నట్లు , అలాగే ఈ మూవీ కొన్ని వారాల థియేటర్ రన్ ను ముగించుకున్న తర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ ని స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో అవుతుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మాత్రం హిట్ ది సెకండ్  కేస్ మూవీ థియేటర్ లలో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: