ఘనంగా హన్సిక పెళ్లి వేడుకలు.. ఫోటోలు వైరల్..!

Divya
టాలీవుడ్, కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న హన్సిక మోత్వాని ఎట్టకేలకు వైవాహిక బంధం లోకి అడుగుపెట్టబోతోంది. తాజాగా నిన్న ఈమె పెళ్లికి సంబంధించి మెహందీ ఫంక్షన్ ను చాలా గ్రాండ్గా నిర్వహించారు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా షేర్ చేయగా అవి బాగా వైరల్ అయ్యాయి. ఇక ఈరోజు ఈమె పెళ్లి జరగబోతోంది. ఇప్పటికే గత మూడు రోజుల క్రితమే జైపూర్ చేరుకుంది హన్సిక . ఈ రోజున ప్రముఖ బిజినెస్ మేన్ సోహైల్ కతూరియాను వివాహం చేసుకోబోతోంది. ఈరోజు వీళ్ల పెళ్లి జైపూర్ లోని చారిత్రక ముండోతా కోటలో జరగబోతున్నట్లు అందరికీ తెలిసిందే.
హన్సిక తన కుటుంబ సభ్యులతో కలిసి ముంబై ఎయిర్పోర్ట్ నుంచి జైపూర్ వెళుతున్న ఫోటోలు, వీడియోలు కూడా బాగా వైరల్ అయ్యాయి. మరొకపక్క హన్సిక తన తల్లితోపాటు మరో వ్యక్తితో కలిసి కనిపించింది. మొన్నటికి మొన్న గ్రీస్లో బ్యాచిలర్ పార్టీ కూడా ఇచ్చిన ఈమె అందుకు సంబంధించిన ఫోటోలను వీడియోలను కూడా ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. గతవారం మాతాకీ చౌకీ కార్యక్రమాన్ని కూడా నిర్వహించింది. ఈరోజు ఎట్టకేలకు వివాహం చేసుకోబోతోంది ఈ మధ్యగుమ్మ. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య హన్సిక , సోహెల్ పెళ్లి ఘనంగా జరగబోతోంది.
నయనతార, విగ్నేష్ శివన్ లాగే తమ పెళ్లి వీడియోని కూడా వీరు ప్రముఖ ఓటీటీ సంస్థకు అమ్మినట్లు సమాచారం. అయితే వీరి పెళ్లిని లైవ్లో ప్రముఖ ఓటీటీ ఛానల్లో ప్రసారం చేయబోతున్నట్లు సమాచారం. కానీ ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ అన్నది స్పష్టత లేదు. ఇకపోతే తెలుగు, తమిళ్ చిత్రాలలో ఎంతో మంది స్టార్ హీరోలతో కలిసి నటించిన ఈమె .. దేశముదురు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకొని ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించి మరింత పాపులారిటీని దక్కించుకుంది. మరి ఈరోజు వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్న హన్సిక వివాహం తర్వాత కూడా సినిమాలలో నటిస్తుందా లేదా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: