ఊరమాస్ స్టెప్పులతో అదరగొట్టిన సిరి..వీడియో..

Satvika
సిరి హన్మంత్ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు..తన అందం, నటనతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. యూట్యూబ్ ద్వారా బాగా పాపులర్ అయిన సిరి ఆ తర్వాత వెబ్ సిరీస్ సీరియస్లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.బిగ్ బాస్ ద్వారా ఓ రెంజ్ లో క్రేజ్ ను సంపాదించుకుంది. ఆ తర్వాత ఇద్దరి లోకం ఒకటే, ఒరేయ్ బుజ్జిగా వంటి సినిమాలలో కూడా నటించింది. సిరి సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను, వీడియోలను ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

అయితే ఇటీవల సిరి బుల్లితెరలో ప్రసారమయ్యే స్టార్ మా పరివారంలో పాల్గొని సందడి చేసింది. ఇక ఈ ప్రోగ్రాంలో మాస్ డాన్స్ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. స్టార్ పరివారం కార్యక్రమానికి హోస్ట్ గా శ్రీముఖి చేస్తుంది. సిరి తో పాటు సన్నీ, ఆర్జె కాజల్, మానస్, అమ్మ రాజశేఖర్, అరియానా గోరి, ముక్కు అవినాష్ లు పాల్గొని అందరిని ఎంటర్టైన్ చేశారు. ఇక ఈ ప్రోగ్రాం లో పాల్గొన్న సిరి ఒక టాస్క్ లో భాగంగా మాస్ డాన్స్ వేస్తుంది. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సూపర్ డూపర్ హిట్ సినిమా అత్తారింటికి దారేది సినిమాలోని బాబు గారి బొమ్మ అనే పాటకు సిరి డాన్స్ చేసి దుమ్ము లేపేసింది.

మ్యూజిక్ రాగానే మొదట చాలా కూల్ గా స్టెప్పులు వేసింది.ఆ తర్వాత మెల్ల మెల్లగా ఊపందుకుంది.మాస్ స్టెప్పులు వేసి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో సిరికి సంబంధించిన ఈ మాస్ వీడియో తెగ వైరల్ అవుతుంది. ఏది ఏమైనా బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన కంటెస్టెంట్లు అందరూ సోషల్ మీడియా ద్వారా ఫుల్ పాపులారిటీ సంపాదించు కుంటున్నారు. బిగ్ బాస్ సీజన్ 5 లో సిరి కంటెస్టెంట్గా చేరి ప్రేక్షకులను నుంచి మంచి క్రేజ్ ను సంపాదించుకుంది..మొత్తానికి ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: