బిగ్ బాస్ శివ జ్యోతిపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్న నెటిజన్స్ ..!?

Anilkumar
తీన్మార్ సావిత్రిగా శివ జ్యోతి తెలుగు ప్రేక్షకులకు మంచి యాంకర్ గా పరిచయమయ్యింది అన్న సంగతి అందరికీ తెలిసిందే.ఇక  తన తెలంగాణ యాసతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. అయితే దీంతో ఆమెకు మంచి అభిమానం ఏర్పడటంతో బుల్లితెరపై ప్రసారమైన రియాలిటీ షో బిగ్ బాస్ లో కూడా అవకాశం అందుకుంది. ఇక అందులో తన ఆటపాటలతో మరింత పరిచయం పెంచుకుంది.బిగ్ బాస్ తర్వాత శివ జ్యోతి ప్రవర్తనలో చాలా మార్పులు వచ్చాయి. అయితే ముఖ్యంగా తన డ్రెస్సింగ్ స్టైల్ లో మాత్రం చాలా మార్పు వచ్చింది. 

ఇక బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు మంచి మంచి డ్రెస్సులను ధరించిన శివ జ్యోతి బయటికి వచ్చాక తన గ్లామర్ ను పరిచయం చేసింది. పొట్టి పొట్టి బట్టలు వేస్తూ గ్లామర్ గా తయారవుతూ అందర్నీ ఆశ్చర్యపరిచేలా చేసింది.బిగ్ బాస్ ఫ్రెండ్స్ తో కలిసి బాగా సందడి చేస్తూ ఉంటుంది.ఇక  సమయం వచ్చిన్నప్పుడల్లా వారితో కలిసి పార్టీలు చేసుకుంటూ ఉంటుంది.అయితే  సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది శివ జ్యోతి. ఇటీవల యూట్యూబ్లో ఛానల్ కూడా క్రియేట్ చేసుకోగా అందులో ఇప్పటికి చాలా వీడియోస్ పంచుకుంది.

అంతేకాదు  చాలా వరకు నగలు కొన్నాను అంటూ, చీరలు కొంటున్నాను అంటూ వీడియోస్ బాగా పంచుకుంటుంది.మళ్ళీ తాజాగా ఒక వీడియో షేర్ చేయగా అందులో కూడా పండుగ కోసం చీరలు కొన్నాను అంటూ దానికి సంబంధించిన పోస్టును ఇన్ స్టాల్ లో పంచుకుంది.ఇక  ఆ పోస్ట్ ని చూసిన నెటిజన్స్ నీకు ఎప్పుడు ఇదే పనా.. ఎప్పుడు బంగారాలు, చీరలు కొనడమేనా అంటూ కామెంట్ పెట్టారు.కాగా  ఓ నెటిజన్ మాత్రం.. షాపు వాడికి ప్రమోషన్ చేసి అన్ని దొబ్బుతున్నావు.. కానీ ఏదో కొన్నట్లు పెద్ద బిల్డప్ ఇస్తున్నావు అంటూ కామెంట్ చేయగా ప్రస్తుతం ఆ కామెంట్ వైరల్ అవుతుంది.అయితే మరి దీనికి శివ జ్యోతి ఏమని స్పందిస్తుందో చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: