కియారా పెళ్లి డేట్ కన్ఫర్మ్ చేసిన ఉమైర్ సంధు..!

Divya
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మహేష్ బాబు హీరోగా వచ్చిన భరత్ అనే నేను సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈ బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ... మొదటి సినిమాతోనే తన అందం, నటనతో ప్రేక్షకులను మెప్పించింది. ఇదే తరుణంలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన వినయ విధేయ రామ సినిమాలో కూడా అవకాశాన్ని దక్కించుకుంది. అయితే ఈ సినిమా ఆశించిన రేంజ్ లో విజయాన్ని అందించలేదు. దీంతో టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి మకాం మార్చిన ఈమె ఇటీవల మళ్ళీ రామ్ చరణ్ - శంకర్ కాంబినేషన్లో వస్తున్న పాన్ ఇండియా సినిమాలో అవకాశాన్ని దక్కించుకుంది.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇదిలా  ఉండగా గత కొన్ని రోజుల కిందటే కియారా అద్వానీ,  ప్రముఖ బాలీవుడ్ నటుడు సిద్ధార్థ మల్హోత్రా ప్రేమలో ఉన్నారు అంటూ బాగా వార్తలు వైరల్ అయ్యాయి. అంతేకాదు ఆమె అతడితో డేటింగ్ లో ఉన్నాను అన్న విషయాన్ని కూడా స్పష్టం చేయలేదు.  కానీ ఎట్టకేలకు ఇంకా ఈ విషయాన్ని దాచలేను డిసెంబర్ రెండవ తేదీన తెలియజేస్తాను అంటూ షాకింగ్ విషయాలు రివిన్ చేసింది కియారా..  దీంతో కియారా.. మల్హోత్రా పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అయ్యాయి.
కానీ తాజాగా ప్రముఖ సినిమా క్రిటిక్ .. ట్రేడ్ అనలిస్ట్ ఉమైర్ సంధూ కియారా అద్వానీ , సిద్ధార్థ మల్హోత్రా ప్రేమ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని జనవరి 5 2023న వారిద్దరి వివాహం చేసుకోబోతున్నారు అంటూ హాట్ బాంబు పేల్చారు. దీంతో అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనవుతున్నారు. మరి కొన్ని కొన్ని సార్లు ఉమైర్ చెప్పే మాటలు కూడా వాస్తవాలుగా మారుతూ ఉంటాయి. మరి ఇందులో ఉమైర్ చెప్పిన మాటలు నిజమేనా? లేక ఆయన ఎప్పటిలాగే ఊహాగానాలు వ్యక్తం చేస్తూ తెలిపాడా? అన్నది సందేహంగా మారింది. ఏది ఏమైనా కియారా అద్వానీ ఈ వార్తలపై స్పందిస్తే తప్ప క్లారిటీ రాదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: