కియారా అద్వానీ ,సిద్ధార్థ్ మలహోత్రా పెళ్లి రూమర్స్ నిజమేనా..!!

murali krishna
బాలీవుడ్ యంగ్  అండ్ బ్యూటీ హీరోయిన్ కియారా అద్వానీ   పెళ్లి పీటలు ఎక్కబోతోంది. తనకు నచ్చిన వ్యక్తినే వివాహాం చేసుకోబోతోంది మనకు సమాచారం. ఇందుకు డేట్ కూడా ఫిక్స్ చేశారని, కియారానే అఫిషియల్ గా అనౌన్స్  కూడా చేయబోతుందని తెలుస్తోంది.
సినీ ఇండస్ట్రీలోని స్టార్ హీరోయిన్లు ఒక్కక్కరూ పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఇప్పటికే రీసెంట్ గా అలియా భట్, నయనతార పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కొద్దిరోజుల కింద హన్సిక మౌత్వానీ కూడా తన లైఫ్ పార్ట్ నర్ ను పరిచయం చేసింది. ఇక మరో యంగ్ బ్యూటీ కియారా అద్వానీ కూడా పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమవుతోంది మనకు తెలుస్తోంది.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ పెళ్లిపై ప్రస్తుతం గట్టిగానే వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే నెలలోనే పెళ్లి కూడా పూర్తి కాబోతుందంటూ ప్రచారం బాగానే జరుగుతోంది. ఇంతకీ ఇందులో నిజమెంత ఉందనే విషయానికొస్తే.. తాజాగా కియారా పెట్టిన పోస్టే దీనికి సాక్ష్యమని అంటున్నారు.
అసలు విషయానికొస్తే.. బాలీవుడ్‌ స్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా ( మరియు కియారా అద్వానీ ఎప్పటినుంచో డేటింగ్ లో ఉన్నారు. దీంతో వీరి ఘాడమైన ప్రేమ పెళ్లి దారితీసినట్టు తెలుస్తోంది. పెళ్లి కూడా మరెప్పుడు కాదు.. మరో వారంలోనే పూర్తి కానున్నట్టు మనకు సమాచారం.
ఇప్పటికే పరోక్షంగా తమ ప్రేమను అంగీకరించిన ఈ బాలీవుడ్ స్టార్స్ త్వరలో అఫిషియల్ ప్రకటన ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. దీనిపై కియారా అద్వానీ తాజాగా ఇన్ స్టా గ్రామ్ లో హింట్ కూడా ఇచ్చింది. 'ఇంకా ఆ రహస్యాన్ని దాచలేను. డిసెంబర్ 2 వరకు వేచి ఉండండి' అని పేర్కొంది. దీంతో పెళ్లిపైనే అధికారిక ప్రకటన ఇవ్వబోతుందని అభిమానులు, నెటిజన్లు అందరూ భావిస్తున్నారు.
మరోవైపు కియారా అద్వానీ - సిద్ధార్థ్ మల్హోత్రా పెళ్లికి డేట్ కూడా ఫిక్స్ అయ్యిందని తెలుస్తోంది. ఇప్పటికే ఇరు కుటుంబాలు వీరి ప్రేమను అంగీకరించి.. సంప్రదాయ పద్ధతుల్లోనే పెళ్లి చేసేందుకు సిద్ధమయ్యారంట. డిసెంబర్ 5న సిద్ధార్థ్ కియారా మెడలో తాళి కట్టబోతున్నారని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కియారా - సిద్ధార్థ్ బాలీవుడ్ లోని సినిమా ఫంక్షన్లకు.. పలు ఈవెంట్లకు కలిసే వెళ్లడంతో వీరి లవ్ కన్ఫమ్ అనేది పరోక్షంగా తెలిసిపోతోంది అని బయట టాక్. ప్రస్తుతం కియారా స్పందించిన తీరు కూడా పెళ్లిపైనే అని గట్టిగానే ప్రచారం జరుగుతుండటం విశేషం. ఇంతకీ ఇందులో నిజమెంత ఉందో తెలియాలంటే డిసెంబర్ 2న వరకు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: