అలియా భట్ సినిమాలకు పూర్తిగా దూరం కానుందా..!?

Anilkumar
బాలీవుడ్ ఇండస్ట్రీలలో టాప్ హీరోయిన్ గా కెరీర్ ను కొనసాగిస్తూ వరుస విజయాలను అందుకుంటున్న హీరోయిన్లలో అలియా భట్ ఒకరు. అయితే ఇక  ఈ స్టార్ హీరోయిన్ సినిమాలకు గుడ్ బై చెప్పనున్నారా? అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది.ఇకపోతే  కొన్నిరోజుల క్రితం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన అలియా భట్ ఇక సినిమాల్లో నటించకూడదని ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది.ఇక  కూతురికి తన లైఫ్ లో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని కూతురితో ఎక్కువ సమయం గడపాలని అలియా భట్ ఫిక్స్ అయ్యారని సమాచారం అందుతోంది.

ఇక ఇప్పటికే ఓకే చెప్పిన సినిమాలను సైతం అలియా భట్ వదులుకున్నారని ఇండస్ట్రీ వర్గాల బోగట్టా. అయితే అలియా భట్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తారో లేదో కచ్చితంగా చెప్పలేమని మరి కొందరు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి. ఇకపోతే అలియా భట్ రాబోయేరోజుల్లో కూడా సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు అయితే దాదాపుగా లేనట్టేనని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.కాగా  అలియా భట్ ఒక్కో ప్రాజెక్ట్ కు 20 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం అందుకుంటున్నారు.ఈకె అలియా భట్ క్రేజ్ వల్ల ఇతర భాషల్లో కూడా

ఆమె నటించిన సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతుండటం హాట్ టాపిక్ అవుతోంది.అయితే  అలియా భట్ రేంజ్ కు తగిన ప్రాజెక్ట్ లు దొరికితే ఆమె స్థాయి మరింత పెరగడం పక్కా అని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అంతేకాకుండా అలియా భట్ టాలీవుడ్ ప్రాజెక్ట్ లలో నటించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్న తరుణంలో అలియా భట్ తీసుకున్న నిర్ణయం ఫ్యాన్స్ కు ఒకింత షాకిస్తోందని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే  ఇక సినిమాలకు దూరమవుతున్నట్టు అలియా భట్ నుంచి అధికారక ప్రకటన రావాల్సి ఉంది.కాగా  అలియాను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: