రవితేజ "రావణాసుర" మూవీ విడుదల వాయిదా పడనుందా..?

Pulgam Srinivas
మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న పాత్రలతో కెరియర్ ను మొదలు పెట్టి , ఆ తర్వాత తన నటన తో ప్రేక్షకులను ఎంత గానో అలరించి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్న మాస్ మహారాజా రవితేజ ఇప్పటికే ఈ సంవత్సరం రెండు మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సంవత్సరం మొదట ఖిలాడి మూవీ తో ప్రేక్షకులను పలకరించిన రవితేజ , ఆ తర్వాత రామారావు అన్ డ్యూటీ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. అలాగే ఈ సంవత్సరం ధమాకా మూవీ తో కూడా ప్రేక్షకులను రవితేజ పలకరించబోతున్నాడు. ధమాకా మూవీ ని డిసెంబర్ 23 వ తేదీన విడుదల చేనున్నారు. ఇది ఇలా ఉంటే రవితేజ ప్రస్తుతం సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రావణాసుర అనే మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసింది.


ఈ మూవీ లో ఫరియా అబ్దుల్లా , అను ఇమ్మానుయల్ , పూజిత పన్నోడా , మేఘ ఆకాష్ , దాక్షా నాగర్కర్ ముఖ్య పాత్రలలో కనిపించనుండగా , సుశాంత్ ఈ మూవీ లో ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే రావణాసుర మూవీ ని వచ్చే సంవత్సరం ఏప్రిల్ 7 వ తేదీన విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని వచ్చే సంవత్సరం ఏప్రిల్ 7 వ తేదీన విడుదల చేయడం కష్టమే అని ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దానికి ప్రధాన కారణం ఈ మూవీ షూటింగ్ అనుకున్న షెడ్యూల్ అనుకున్నట్టుగా జరగకపోవడమే అని వార్తలు వస్తున్నాయి. మరి ఈ మూవీ ని ఏ తేదీన విడుదల చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: