పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లు లో నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో నిది అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , ఎం ఎం కీరవాణి ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ప్రస్తుతం హరి హర వీరమల్లు మూవీ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ లో వేసిన ప్రత్యేక సెట్ లో జరుగుతున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగా ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఇంటర్వెల్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
హరి హర వీరమల్లు మూవీ లో బాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న నటులు అయినటు వంటి బాబీ డియోల్ మరియు నోరా ఫతేహీ నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. వీరిద్దరూ కూడా వచ్చే నెల నుండి ఈ మూవీ షూటింగ్ లో జాయిన్ కాబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇప్పటికే హరి హర వీరమల్లు మూవీ నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా అవి అద్భుతమైన రేంజ్ లో ఉండడంతో ఈ మూవీ పై పవన్ కళ్యాణ్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు . పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు క్రిష్ జాగర్లమూడి కెరియర్ లో ఇదే మొట్ట మొదటి ఇండియా మూవీ కావడం విశేషం. హరిహర వీరమల్లు మూవీ తో పవన్ కళ్యాణ్ ఏ రేంజ్, విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటాడో చూడాలి.