సార్: సినిమా విడుదల తేదీ లాక్..!!

Divya
కోలీవుడ్లో తనదైన విలక్షణమైన నటనతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న నటులలో ధనుష్ కూడా ఒకరు. ఇటీవల హాలీవుడ్ లో కూడా ప్రవేశించి ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు ధనుష్. ఇక ఇప్పుడు తెలుగులో మొదటిసారిగా స్ట్రైట్ మూవీతో ఎంట్రీ ఇవ్వబోతున్నారు ధనుష్ ద్విభాష చిత్రమైన సార్ (వాతి) చిత్రం ఇటీవల హాట్ టాపిక్ గా మారుతోంది. ఈ సినిమా ప్రచారంలో చాలా స్పీడ్ పెంచింది చిత్ర బృందం ఇక ఇందులో సరసన హీరోయిన్ సంయుక్త మీనన్ నటిస్తూ ఉన్నది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు.
చాలా గ్యాప్ తర్వాత సాయికుమార్ కూడా ఇందులో విలన్ గా కనిపించబోతున్నారు. శ్రీకర సూర్య సమర్పణలో, సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తూ ఉన్నారు. ఇటీవలే ఈ సినిమా పోస్టర్ విడుదలవ్వగా ధనుష్ ఎప్పటిలాగే యంగ్ కుర్రాడిలా కనిపిస్తూ నేచురల్ గా ఆకట్టుకుంటూ ఉండడమే కాకుండా ఇక హీరోయిన్ సంయుక్త మీనన్ కూడ ఇందులో చీర కట్టులో మరింత ఆకర్షణీయంగా నిలుస్తోంది అంటే వార్తల కూడా వినిపిస్తున్నాయి. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ సినిమా పాటలు విడుదల కావడం జరిగింది.
దీంతో ధనుష్ నటిస్తున్న ఈ చిత్రం పైన భారీ అంచనాలు ఏర్పడ్డాయి తాజాగా సార్ (వాతి) నిర్మాతలు విడుదల తేదీని ప్రకటించారు 17 ఫిబ్రవరి వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తెలుగు తమిళ భాషలలో ఒకేసారి విడుదల కాబోతుందని తెలియజేశారు. రిలీజ్ పోస్టర్లు ధనుష్ నీలిరంగు ఫార్మల్ షర్ట్ ధరించి విద్యార్థుల సహాయంతో ఒక రౌండప్ చేయబడి కళాశాల నుంచి స్టెప్స్ మీద నిలబడినట్లుగా తెలుస్తోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ మొత్తం సింగిల్ మాస్టర్ మాస్టర్ అభిమానుల నుండి సానుకూల స్పందన లభిస్తోంది. ఈ చిత్రంలో తనికెళ్ల భరణి ,హైపర్ ఆది, సముద్రఖని తదితరులు కీలకమైన పాత్రలో నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: