భారీ ప్రాజెక్ట్ లను రిజెక్ట్ చేసిన సామ్..ఏంటంటే ?

Satvika
తెలుగు స్టార్ హీరోయిన్ అంటే మొదటగా వినిపించేది మాత్రం సమంతది. పుష్ప లో చేసిన ఐటమ్ సాంగ్ మంచి క్రేజ్ ను అందించింది..ఇప్పుడు యశోద సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ సినిమాపై ముందునుండీ మంచి అంచనాలు క్రియేట్ కావడం, కథ కూడా రిఫ్రెషింగ్‌గా ఉండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది.అటు ఓవర్సీస్‌లోనూ ఈ సినిమాకు ప్రేక్షకులు పట్టం కడుతున్నారు. ఇటీవల తన అనారోగ్యం గురించి చెప్పుకొచ్చిన సమంత, తన కెరీర్‌లో ఎవరూ ఊహించని విధంగా ఓ మూడు భారీ ప్రాజెక్టులను రిజెక్ట్ చేసినట్లుగా చెప్పుకొచ్చింది.

అసలు ఆ సినిమాలను ఆమె ఎందుకు రిజెక్ట్ చేసింది అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. అయితే సమంత రిజెక్ట్ చేసిన ఆ సినిమాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో విక్రమ్ నటించిన వైవిధ్యమైన సినిమా 'ఐ' లో తొలుత హీరోయిన్‌గా సమంతను అనుకున్నారట. అయితే ఆమె కొన్ని కారణాల వల్ల ఈ సినిమాను రిజెక్ట్ చేసింది. ఇక ఆ తరువాత సుకుమార్ తెరకెక్కించిన మాస్ ఎంటర్‌టైనర్ మూవీ 'పుష్ప'లో కూడా సామ్‌ను హీరోయిన్‌గా అనుకున్నారట. కానీ, డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఆమె ఈ సినిమాకు నో చెప్పిందని తెలుస్తోంది..

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ నటిస్తున్న తాజా చిత్రం 'పఠాన్'లో కూడా సామ్‌ను హీరోయిన్‌ గా తీసుకోవాలని చూశారట. కానీ తన పర్సనల్ కారణాల వల్ల ఆమె ఈ సినిమాను రిజెక్ట్ చేసిందట. ఇలా చేతివరకు వచ్చిన మూడు బిగ్ ప్రాజెక్టుల ను సమంత రిజెక్ట్ చేసిందని తెలిసి, ఆమె అభిమానులు అవాక్కవుతున్నారు. ఇక ప్రస్తుతం ఆమె విజయ్ దేవరకొండ సరసన ఖుషి అనే సినిమా లో నటిస్తున్నారు.. ఈ సినిమా పై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి.. మరి ఎలాంటి టాక్ ను అందుకుంటుందొ చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: