పాపం: మహేష్ బాబుకి ఈ ఏడాది శాపమేనా..?
అయితే ఈ మరణ వార్త కృష్ణ ని కూడా చాలా కదిలి వేసింది. ఇక ఆ తరువాత రెండు నెలల క్రితం కృష్ణ మొదటి భార్య ఇందిరాదేవి కూడా మరణించడం జరిగింది. అలా కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే భార్య కొడుకు కోల్పోయిన కృష్ణ మానసికంగా మరింత బలహీనంగా మారిపోయారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఆదివారం రోజున కృష్ణకు గుండెపోటు రావడంతో కాంటినెంటల్ హాస్పిటల్ కి తీసుకువెళ్లారు అక్కడ డాక్టర్లు కృష్ణను బ్రతికించేందుకు విశ్వ ప్రయత్నాలు చేసిన కృష్ణ గారిని కాపాడలేకపోయామని వైద్యులు తెలియజేశారు.
ఈ ఏడాది మహేష్ అన్న ,అమ్మలతోపాటు తనని స్టార్ డం తెచ్చిపెట్టిన తండ్రి కృష్ణ కూడా కోల్పోవడంతో ఈ ఏడాది ఒక బ్యాడ్ ఇయర్ గా మారిపోయింది ఘట్టమనేని ఫ్యామిలీకి. తన తల్లి మరణంతో చాలా డిస్టర్బ్ అయిన మహేష్ బాబు ఆ విషయం నుంచి తీరుకుంటూ ఉండంగానే ఇలా తండ్రి మరణించడంతో ఒకసారిగా దిగ్బ్రాంతికి గురయ్యారు. మహేష్ బాబును నతవారసుడిగా చూడాలని చైల్డ్ యాక్టర్ గానే పరిచయం చేసిన కృష్ణ అప్పటినుంచి ఎంతో సపోర్టుతో మహేష్ బాబుకు అండగా నిలిచారు. అలాంటి మహేష్ బాబు ఒకేసారి తన కుటుంబంలో ముగ్గురిని కోల్పోవడంతో అభిమానులు కూడా చాలా బాధపడుతున్నారు.