ఓటీటి లో కాంతారా ఆలస్యానికి కారణం అదేనా..?

Divya
భాషతో సంబంధం లేకుండా కేవలం కంటెంట్ ఉంటే చాలు కలెక్షన్ల సునామి సృష్టిస్తుందని చెప్పడంలో నిరూపితం చేసిన సినిమాలు చాలానే ఉన్నాయి. అలా ఇప్పుడు తాజాగా కన్నడ సినిమా ఇండస్ట్రీలో విడుదలై మంచి విజయ దిశగా దూసుకుపోతున్న చిత్రం కాంతారా. ఈ చిత్రం ఇప్పటివరకు రూ. 350 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏ మాత్రం అంచనాలు లేకుండా విడుదలై ఈ సినిమా ఇంతటి ఘన విజయాన్ని అందించడంలో చిత్ర నిర్మాతలు కూడా ఈ సినిమా కలెక్షన్లు చూసి చాలా ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా ఎటువంటి ప్రమోషన్స్ చేయకపోయినా కేవలం మౌత్ టాకు ద్వారానే సోషల్ మీడియా బజ్ తో ఈ సినిమా మంచి సూపర్ హిట్ గా నిలిచిందని చెప్పవచ్చు.

అందుచేతనే ఈ చిత్రాన్ని మరికొన్ని భాషల్లో విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నహాలు చేస్తూ ఉన్నారు. కన్నడలో విడుదలైన ఈ సినిమా బాగుందని పేరు వస్తే చాలు తెలుగు, మలయాళం, తమిళ్, హిందీ వంటి భాషలలో డబ్ చేసి విడుదల చేస్తున్నారు. ఈ సినిమా విడుదల ఇప్పటికే కొన్ని వారాలు గడుస్తున్న ఓటీటి లో మాత్రం ఇంకా ఈ సినిమా విడుదల కాలేదు. కన్నడలో ఈ చిత్రం సెప్టెంబర్ 30వ తేదీన విడుదలైనప్పటికీ అతి తక్కువ వ్యవధిలోని తెలుగులో విడుదల చేశారు తెలుగులో కూడా అక్టోబర్ 15న విడుదల చేయడం జరిగింది.
కాంతార చిత్రం విడుదలై ఇప్పటికి నెల రోజులు కావస్తున్న థియేటర్లలో ఇంకా హౌస్ ఫుల్ గానే ఉండడం గమనార్హం. ఈ చిత్రాన్ని ఓటీటి లో చూడాలనుకునే  వారు సైతం థియేటర్లలో ఎక్స్పీరియన్స్ కోసం వెండితెర మీద చూసేందుకు ఎక్కువ మక్కువ పడుతున్నారు. అయితే ఈ సినిమా విడుదల ఇప్పటికి ఎన్ని రోజులు అవుతున్న ఓటీటిలో ఎందుకు రాలేదనే విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. అయితే ఈ సినిమా మాత్రం అమ్మేజన్ లో విడుదల కావాల్సి ఉంది మొదటివారం ఈ సినిమా తెలుగులో రూ. 60 కోట్ల వరకు కలెక్షన్స్ సాధించినట్లుగా తెలుస్తోంది. కేవలం కలెక్షన్లు వస్తున్న కారణంగా ఓటీటి లో ఆలస్యం అవుతుందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: