ఎన్నో తెలుగు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి తన నటన తో ప్రేక్షకులను అలరించిన తేజ సజ్జ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కెరియర్ లో ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్న తేజ సజ్జ ప్రస్తుతం సినిమాల్లో హీరోగా నటిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా ఇప్పటికే తేజ సజ్జ , ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన జాంబి రెడ్డి అనే మూవీ లో హీరోగా నటించాడు. జాంబీస్ కాన్సెప్ట్ లో తెరకెక్కిన జాంబి రెడ్డి మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఈ మూవీ ద్వారా తేజ సజ్జ కు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఈ యువ హీరో అద్భుతం అనే మూవీ లో హీరోగా నటించాడు.
ఈ మూవీ థియేటర్ లలో కాకుండా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో విడుదల అయింది. ఈ మూవీ కి కూడా ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం తేజ సజ్జ "హనుమాన్" అనే మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ కి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది వరకే వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన జాంబి రెడ్డి మూవీ మంచి విజయం సాధించడంతో హనుమాన్ మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ ను విడుదల చేసింది. హనుమాన్ మూవీ యూనిట్ ఈ సినిమా టీజర్ ను నవంబర్ 15 వ తేదీన ఉదయం 9 గంటలకు ఏ ఎం బి సినిమా స్క్రీన్ 1 , హైదరాబాద్ లో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. మరి హనుమాన్ మూవీ టీజర్ ప్రేక్షకులను ఏ రేంజ్ లో ఆలరిస్తుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.