హీరోయిన్ ఆదాశర్మ ప్రధాన పాత్రలో నటించిన ది కేరళ స్టోరీ వివాదంలో చిక్కుకుంది. ఇక ఇటీవల విడుదల చేసిన ఈ టీజర్ పై కేరళ రాష్ట్రవాసులు మండిపడుతున్నారు.ఇక అందులో పేర్కొన్న అంశాలు షాకింగ్‌గా ఉన్నాయంటున్నారు ఆ రాష్ట్ర వాసులు.అయితే కేరళలో 32 వేల మంది అమ్మాయిలను ఇస్లాంలోకి మార్చి విదేశాలకు పంపించి ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారంటూ ఓ డైలాగ్ ఆ మూవీ టీజర్ లో ఉంది. ఇప్పుడు అదే డైలాగ్ కేరళలో వివాదానికి కారణమయ్యింది. ఇదే విషయం పై అభ్యంతరం తెలుపుతూ కేరళ సీఎంకు ఫిర్యాదు చేశారు.
ఇక దీంతో ఎఫ్ఐఆర్ నమోదు చేసి సరైన విచారణకు ఆదేశించారు కేరళ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అనిల్ కాంత్.అయితే ఈ అంశంపై దర్యాప్తు జరుపుతున్న తిరువనంతపురం పోలీసులు.'ది కేరళ స్టోరీ' టీజర్ వైరల్‌గా మారింది. కేరళను కించపరిచే విధంగా చిత్రీకరించినందుకు ఈ టీజర్‌పై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.. 'నా పేరు షాలిని ఉన్నికృష్ణన్. నర్సుగా ప్రజలకు సేవ చేయాలనుకున్నాను.అయితే ఇప్పుడు నేను ఫాతిమా బా అనే ఐసిస్ ఉగ్రవాదిని.ఇక 'నేను ఆఫ్ఘనిస్థాన్‌లో జైల్లో ఉన్నాను' అనే డైలాగ్‌తో టీజర్ మొదలవుతుంది.
అంతేకాదు 'నేను ఒంటరిని కాదు.ఇక నాలాంటి 32 వేల మంది అమ్మాయిలు మతం మారి సిరియా, యెమెన్ ఎడారుల్లో చనిపోయారు.అయితే ఓ సాధారణ అమ్మాయి ప్రమాదకరమైన ఉగ్రవాదిగా మారే భయంకరమైన గేమ్ కేరళలో చోటుచేసుకుంది. అది కూడా బహిరంగంగానే.కాగా దీన్ని ఎవరూ ఆపలేదా? ఇది నా కథ. ఆ 32 వేల మంది అమ్మాయిల కథ ఇది.ఇక 'ఇది కేరళ కథ' అంటూ ఆదాశర్మ చెప్పిన డైలాగ్‍తో టీజర్ ముగిసింది.ఇక ఆదాశర్మ నటించిన ఈ టీజర్.. మాజీ వీఎస్ అచ్యుతానంద గతంలో ప్రసంగాన్ని తప్పు సబ్ టైటిల్స్ ఉపయోగించినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.అయితే ఇందుకు సంబంధించిన వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి..!