మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రామ్ చరణ్ ఇప్పటికే అనేక బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరోగా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నాడు. రామ్ చరణ్ ఈ సంవత్సరం ఆర్ ఆర్ ఆర్ మరియు ఆచార్య మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. ఇందులో ఆర్ ఆర్ ఆర్ మూవీ భారీ బ్లాక్ బాస్టర్ విజయం సాధించగా , ఆచార్య మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఇది ఇలా ఉంటే రామ్ చరణ్ "ఆర్ ఆర్ ఆర్" మూవీ తో పాన్ వరల్డ్ రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకున్నాడు.
ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రామ్ చరణ్ , శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. కియరా అద్వానీ ఈ మూవీ లో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , అంజలి , సునీల్ ఈ మూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు. తమన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఈ మూవీ ని శంకర్ తన పూర్వపు మూవీ ల మాదిరిగా భారీ బడ్జెట్ తో భారీ గ్రాండ్ డియర్ గా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ లో యాక్షన్ సన్నివేశాలు , పాటలు అత్యద్భుతంగా ఉండబోతున్నట్లు తెలుస్తుంది.
ఇది ఇలా ఉంటే రామ్ చరణ్ ప్రస్తుతం తన తదుపరి మూవీ లపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. అందులో భాగంగా ఉప్పెన మూవీ తో బ్లాక్ బస్టర్ విజన్ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న బుచ్చిబాబు సన దర్శకత్వంలో ఒక మూవీ లో నటించడానికి రామ్ చరణ్ ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా తాజాగా రామ్ చరణ్ మరియు బుచ్చి బాబు ల మధ్య చిన్న స్టోరీ డిస్కషన్ లు కూడా జరిగినట్లు తెలుస్తోంది. అన్ని కుదిరితే రామ్ చరణ్ , బుచ్చిబాబు కాంబినేషన్ లో ఒక మూవీ తెరకెక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.