సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా 'యశోద' ఇంకా రిలీజ్ కి వారం సమయం ఉన్న నేపథ్యంలో మరింత మంది నటులు..సాంకేతిక నిపుణుల్ని సైతం ప్రచారం కోసం తెచ్చే అవకాశం ఉంది. అయితే సినిమాలో ప్రధాన పాత్ర దారి అయిన హీరోయిన్ సమంత మాత్రం 'యశోద' ప్రచారానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితులు వచ్చాయి. దానికి కారణం కూడా తెలిసిందే.సమంత మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడటంతో చికిత్సలో ఉంది. ఈ జబ్బుకి ట్రీట్మెంట్ ఎన్ని రోజులు పడుతుందో కూడా ఇంకా క్లారిటీ లేదు.ఇంకా అటుపై విశ్రాంతి అంతే అవసరం. ఈ నేపథ్యంలో డాక్టర్లు ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెళ్లకూడదని ఆమెకు సూచనలిచ్చారు. సమంత కూడా అంతే జాగ్రత్తగా ఉంది. 'యశోద' సినిమా షూటింగ్ సమయంలోనే జబ్బు బారిన పడినా సమంత ఎలాంటి ఆటంకం కలగకూడదని భావించి విషయాన్ని ఎవరికీ చెప్పలేదు.
సినిమా పనులన్నీ కూడా పూర్తయిన తర్వాత సోషల్ మీడియా ద్వారా రివీల్ చేసి అభిమానులకు సడెన్ షాక్ ఇచ్చింది. ఇక ఈ విషయంలో 'యశోద' మూవీ టీమ్ ఎంతో చింతిస్తోంది.ఆమె ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా సినిమా కోసం పనిచేసిన గొప్ప నటి అని వారు కీర్తిస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రచారంలో సమంత పాల్గొనకపోవడం అనేది సినిమాకి అతి పెద్ద మైనస్ అని చెప్పాలి.ఇక సమంత ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాదని ప్రొడ్యూసర్ కృష్ణ ప్రసాద్ కంఫర్మ్ చేశారు. సమంత ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుందని నమ్మకంగా ఉందట. కాంతార సినిమా లాగా పెద్ద విజయం సాధిస్తుందని సమంత భావిస్తుందట. మరి చూడాలి యశోద సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుందో అనేది.అలాగే సమంత గుణశేఖర్ దర్శకత్వంలో 'శాకుంతలం' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పాన్ ఇండియా రేంజిలో రిలీజ్ అవుతుంది.