ప్రిన్స్ మూవీ అన్ని కోట్ల నష్టాన్ని మిగిల్చిందా..!!

Divya
రెమో, వరుణ్ డాక్టర్, కాలేజ్ డాన్ తదితర చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన నటుడు శివ కార్తికేయన్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. అయితే తాజాగా నటించిన ప్రిన్స్ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది.ఈ చిత్రం జాతి రత్నాలు ఫేమ్ డైరెక్టర్ అనుదీప్ కేవి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా తమిళ్ , తెలుగు భాషలలో ఒకేసారి అక్టోబర్ 21న దీపావళి పండుగ సందర్భంగా విడుదల కావడం జరిగింది. శ్రీ వెంకటేశ్వర సినిమా ఎల్ఎల్పి సురేష్ ప్రొడక్షన్ శాంతి టాకీస్ బ్యానర్ పై చిత్రాన్ని నిర్మించారు. మొదటి రోజు ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను సొంతం చేస్తుంది. అయితే ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్ విషయానికి వస్తే ఈ సినిమా సక్సెస్ అయ్యిందా ఫెయిల్యూర్ అయిందా అనే విషయాన్ని తెలుసుకుందాం.
1). నైజాం -1.10 కోట్ల రూపాయలు.
2). సీడెడ్-31 లక్షలు.
3). ఉత్తరాంధ్ర-47 లక్షలు.
4). ఈస్ట్+వెస్ట్ -29 లక్షలు.
5). గుంటూరు+ కృష్ణ-43లక్షలు
6). నెల్లూరు-22లక్షలు.
7). ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొదటివారం కలెక్షన్ల విషయానికి వస్తే.. రూ 2.82 కోట్ల రూపాయల రూపాయలను రాబట్టింది.
8). రెస్ట్ ఆఫ్ ఇండియా+. ఓవర్సీస్-20 లక్షలు.
9). ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల విషయానికి వస్తే రూ3.2 లక్షల రూపాయలను మాత్రమే రాబట్టింది.
ప్రిన్స్ సినిమా తెలుగు రాష్ట్రాలలో  థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే.. రూ.5.28 కోట్ల రూపాయలు జరగగా నిర్మాతలు ఈ సినిమాని ఓన్ గా విడుదల చేశారు కాబట్టి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే.. రూ.5.5 కోట్ల రూపాయల వరకు రాబట్టాల్సి ఉంటుంది. అయితే ఈ సినిమా ముగిసే సమయానికి కేవలం రూ.3.2 కోట్ల రూపాయలను మాత్రమే రాబట్టింది దీంతో ఈ సినిమా విడుదల చేసిన నిర్మాతలకు సైతం రూ.2.48 కోట్ల రూపాయల నష్టాన్ని మిగిల్చింది. ఇక బడా సినిమాలు పోటీగా విడుదల కావడంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సత్తా చాట లేకపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి. సోలో ఒక ఈ సినిమా విడుదల చేసి ఉంటే కాస్త బెటర్ కలెక్షన్స్ వచ్చేవని శివ కార్తికేయన్ అభిమానులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: