కియారా పెళ్లి చేసుకుంటే ఎలా?

P.Nishanth Kumar

బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కొంతమంది హీరో హీరోయిన్ లు ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. వీరిలో కొంతమంది విడిపోగా ఇంకొంతమంది ప్రేమ వివాహం చేసుకొని తమ సంసార జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఆ విధంగా ఇటీవలే కొంతమంది హీరో హీరోయిన్లు వివాహం చేసుకోవడం జరిగింది. అగ్ర హీరో హీరోయిన్లుగా ఉన్నవారు సైతం ప్రేమ వివాహం చేసుకొని కొత్త దాంపత్యాన్ని మొదలు పెట్టగా తాజాగా ఆ జాబితాలోకి మరొక టాప్ హీరో హీరోయిన్ లుగా చేయబోతున్నారని వార్త బాలీవుడ్ వర్గాల నుంచి వినిపిస్తుంది.

బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న హీరోయిన్ కియారా అద్వాని తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచయమైన హీరోయిన్. తెలుగులో రెండు సినిమాలు మాత్రమే చేసినప్పటికీ ఈ ముద్దుగుమ్మకు ఏ స్థాయిలో క్రేజీ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం రామ్ చరణ్ సరసన శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న ఈ ముద్దుగుమ్మకు బాలీవుడ్ లో కూడా మంచి మంచి ఆఫర్లు వస్తున్నాయని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ఈమె గత కొన్ని రోజుల నుంచి బాలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ మల్హోత్రాతో డేటింగ్ లో ఉందనే వార్తలు ఎక్కువగా వినిపించాయి. త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని కూడా చెప్పారు 

అయితే ఎప్పటికప్పుడు వీరిద్దరూ ఈ విషయాన్ని దాట వేస్తూ వచ్చినా కూడా తాజాగా వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్తలు రావడం జరుగుతుంది. దీని పట్ల వీరు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. ఇంకొకవైపు ఈమె పెళ్లి చేసుకుంటే తెలుగులో చేస్తున్న సినిమాల పరిస్థితి ఏమిటి అనే విధంగా కొంతమంది మేకర్స్ భయపడుతున్నారట. పెళ్లి తర్వాత కూడా ఈమె సినిమాలు చేస్తాను అన్న హామీ ఇవ్వడంతో వారు ఇప్పుడు నార్మల్ గా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఏదేమైనా తెలుగులో ఇప్పుడిప్పుడే కెరియర్ ను మొదలు పెడుతున్న కియారా అద్వానీ అప్పుడే పెళ్లి చేసుకోవడం ఆమె అభిమానులను నిరాశ పరుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: