మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వాల్తేరు వీరయ్య అనే మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వం వహిస్తూ ఉండగా , movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు ఈ మూవీ ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ లో చిరంజీవి వింటేజ్ లుక్ లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాల్లో మెగాస్టార్ చిరంజీవి తన వింటేజ్ లుక్ తో ప్రేక్షకులను అలరించాడు. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ నుండి చిత్ర బృందం ఒక టీజర్ ను విడుదల చేయగా , ఆ టీజర్ లో కూడా మెగాస్టార్ చిరంజీవి తన వింటేజ్ లుక్ తో , అదిరిపోయే డైలాగ్ లతో ప్రేక్షకులను అలరించాడు.
ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో చిరంజీవి సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ లో మాస్ మహారాజా రవితేజ ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే వాల్తేరు వీరయ్య మూవీ లో బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌటేలా ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించబోతుంది. ఇది ఇలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి చాలా రోజుల తర్వాత ఊర మాస్ మూవీ లో నటిస్తూ ఉండడంతో వాల్తేరు వీరయ్య మూవీ పై ప్రేక్షకుల భారీ అంచనాలు పెట్టుకున్నారు.
అలా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు కలిగి ఉన్న నేపథ్యం లో ఈ మూవీ కి అదిరి పోయే రేంజ్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం వాల్తేరు వీరయ్య మూవీ కి ఓవర్సీస్ లో 7.5 కోట్లు , ఆంధ్ర లో 45 కోట్లు , సీడెడ్ లో 15 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం వాల్తేరు వీరయ్య మూవీ షూటింగ్ చివరి దశకు చేరినట్లు తెలుస్తోంది. మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ కంప్లీట్ కానున్నట్లు తెలుస్తోంది.