ఆ హీరోయిన్ చెప్పడం వల్లే చైతూ విడాకులు తీసుకున్నాడా..?

Anilkumar
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత...నాగచైతన్యకు సంబంధించిన మరో కొత్త వార్త వెలుగులోకి వచ్చింది.ఇక  ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.అయితే  అక్కినేని నాగార్జున కొడుకు నాగచైతన్య స్టార్ హీరోయిన్ సమంత ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.అంతలా ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట పట్టుమని 10 సంవత్సరాలు కూడా కాపురం చేయకుండానే ఏవో మనస్పర్థల కారణంగా ఎవరి దారి వారు చూసుకొని విడాకులు తీసుకున్నారు.ఈ నేపథ్యంలోనే ఈ జంటపై ఎన్నో రూమర్లు తెరమీదికి వచ్చాయి. 

ఇక కొంతమంది సమంతను తిట్టిపోస్తే మరికొంతమంది నాగచైతన్య ను ఓ ఆట ఆడుకున్నారు.ఇకపోతే ఎక్కువగా మాత్రం సమంతనే ట్రోల్ చేశారు. అయినా కూడా ఇక  సమంత వాటిని ఏం పట్టించుకోకుండా సినిమాలు చేసుకుంటూ బిజీగా మారిపోయింది. తాజాగా తాను మాయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నానని సమంత తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఓపెన్ గా చెప్పుకొచ్చింది.ఇక  దీంతో సమంత త్వరగా కోలుకోవాలని అభిమానులు సెలబ్రిటీలు అందరూ దేవున్ని ప్రార్థించారు. ఇలాంటి నేపథ్యంలోనే ఒక సంచలమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే నాగచైతన్య రెండో పెళ్లి చేసుకోమని కోరింది ఓ స్టార్ హీరోయిన్ అంట.

 ఇక ఆ హీరోయిన్ ఎవరో కాదు సమంతనే.ఎందుకంటే సమంతకి ఇలాంటి వ్యాధి ఉందని ఎప్పుడు ఏం జరుగుతుందో ఆమెకే తెలియదని అందువల్లే నాగచైతన్య తనతో ఇబ్బంది పడకూడదని భావించి తాను హ్యాపీ లైఫ్ ని లీడ్ చేయాలని భావించి నాగచైతన్యతో సమంత విడాకులు తీసుకున్నట్లు ఓ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. ఇక ఈ విషయాన్ని సమంత తానే స్వయంగా బయట పెట్టడంతో సమంత పాపం నాగచైతన్య భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అలా చేసింది కావచ్చు అని అక్కినేని అభిమానులు మాట్లాడుకుంటున్నారు. గతంలో ఓసారి నాగచైతన్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మీకు మళ్ళీ రెండోసారి ప్రేమ పుడుతుందా అని హోస్ట్ అడిగితే కచ్చితంగా రెండోసారి ప్రేమ పుడుతుంది అంటూ బదులిచ్చాడు. ఈ విషయాన్ని బట్టి చూస్తే నాగచైతన్య రెండో పెళ్లి ఖచ్చితంగా చేసుకుంటాడని అర్థం అయిపోతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: